క‌రోనా సెకెండ్ వేవ్‌..వచ్చే నాలుగు వారాలే కీల‌మంటున్న కేంద్రం!

పాజిటివ్ కేసులు త‌గ్గుతున్నాయి.. మ‌ర‌ణాలు త‌గ్గుతున్నాయి.. హ‌మ్మ‌య్య అని ఊపిరి పీల్చుకునేలోపే.. మ‌ళ్లీ క‌రోనా సెకెండ్ వేవ్ రూపంలో వేగంగా విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలోనే భార‌త్‌లో క‌రోనా పాజిటివ్ కేసులు భారీగా న‌మోదు అవుతున్నాయి. ఇలాంటి త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేసింది.

కరోనాపై పోరాటంలో వచ్చే నాలుగు వారాలూ అత్యంత కీలకమని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఇంత‌కు ముందు వైరస్‌తో పోలిస్తే కొత్త వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని.. అందువ‌ల్ల దేశప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలు తప్పక పాటించాలని హెచ్చరించింది.

అలాగే కరోనా సెకండ్ వేవ్ ను అరికట్టడంలో ప్రజల భాగస్వామ్యం అవ్వాల‌ని తెలిపారు. కాగా, క‌రోనాను అంతం చేసేందుకు ప్ర‌స్తుతం దేశంలో వ్యాక్సినేష‌న్ ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ జోరు జోరుగా కొన‌సాగుతోంది.