నంద్యాల‌లో టీడీపీని ఓడించాల‌ని గోదావ‌రి జ‌నాల ర్యాలీ

నంద్యాల‌లో టీడీపీని ఓడించాల‌ని వైసీపీ వాళ్లు, వైసీపీని ఓడించాల‌ని టీడీపీ వాళ్లు ర‌క‌ర‌కాల స్కెచ్‌లు వేస్తున్నారు. అక్క‌డ స్కెచ్‌లు అలా ఉంటే క‌ర్నూలు జిల్లాకు అవ‌త‌ల జిల్లాల‌కు చెందిన జ‌నాలు కూడా నంద్యాల‌లో వైసీపీకి ఓట్లేసి టీడీపీని ఓడించాల‌ని ర్యాలీలు చేస్తుండ‌డం విశేషం. గోదావ‌రి జిల్లాల పేరు చెపితే అధికార టీడీపీకి ఎంత కంచుకోట‌లో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ప‌శ్చిమగోదావ‌రి జిల్లా పేరు చెపితే మొత్తం ప‌సుపే గుర్తుకు వ‌స్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ జిల్లాలో 15 అసెంబ్లీ సీట్ల‌తో పాటు 2 ఎంపీ సీట్లు టీడీపీ గెలుచుకుని క్లీన్‌స్వీప్ చేసింది. ఈ జిల్లాలో డెల్టా ప్రాంతంలో నిర్మిస్తోన్న తుందుర్రు మెగా అక్వా ఫుడ్ పార్క్‌కు వ్య‌తిరేకంగా యేడాదిన్న‌ర కాలంగా అక్క‌డ పెద్ద ఎత్తున ఉద్య‌మం న‌డుస్తోంది.

ఈ విషయంలో ప్రభుత్వం పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ప్రజాందోళనలను పట్టించుకోవ‌డం లేదు. అక్క‌డ డెల్టా గ్రామాల్లో 144 సెక్ష‌న్లు పెట్టి మ‌రీ పోలీసుల ప‌హారా న‌డుమ ఫ్యాక్ట‌రీ నిర్మిస్తున్నారు. మ‌హిళ‌లు అని చూడ‌కుండా అక్క‌డ వారిని పోలీసులు ఇష్ట‌మొచ్చిన‌ట్టు కొట్టారు. అక్క‌డ ఫ్యాక్ట‌రీ నిర్మాణం వ‌ద్ద‌ని పోరాడుతోన్న కొంద‌రు మ‌హిళ‌ల‌ను రోజుల త‌ర‌బ‌డి జైళ్లలో కూడా నిర్బంధించారు.

ఇక ఇక్క‌డ ప్ర‌జ‌ల త‌ర‌పున పోరాడుతోన్న విశ్వ‌మాన‌వ‌వేదిక అనే స్వ‌చ్ఛంద సంస్థ అధినేత మ‌ల్లుల సురేష్‌ను కూడా 40 రోజుల పాటు జైళ్లో పెట్ట‌డంతో ఆయ‌న‌పై ఎన్నో అక్ర‌మ కేసులు కూడా బ‌నాయించారు. సురేష్‌ను టార్గెట్‌గా చేస్తూ పాల‌కొల్లు టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడు తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేస్తున్నాడు. దీనిపై సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ఫైట్ జ‌రుగుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు నంద్యాల ఉప ఎన్నికల వేళ తుందుర్రు ఫుడ్ పార్క్ బాధితులు మ‌రింత ఫైర్ అయ్యారు. నంద్యాల ఉపఎన్నికలో టీడీపీని అడ్రస్‌ లేకుండా చేయాలని వారు నంద్యాల ఓటర్లను కోరారు. తుందుర్రు, జొన్నలగరువు, కె బేతపూడి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీడీపీ డౌన్‌డౌన్, చంద్రబాబు డౌన్‌.. డౌన్‌ అంటూ నినదించారు. ర్యాలీని పోలీసులు లాఠీలతో అడ్డుకునే ప్రయత్నం చేయగా మహిళలు, పోరాట కమిటీ నాయకులు లెక్కచేయకుండా ముందుకు సాగారు.