శాత‌క‌ర్ణి వ‌సూళ్లు…తిరుగులేని రికార్డు

ఈ సంక్రాంతికి మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150తో పోటీ ప‌డి థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన యువ‌ర‌త్న బాల‌కృష్ణ గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి సినిమా సాధించే రికార్డులు బాల‌య్య కేరీర్‌లోనే అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకుంటున్నాయి. నైజాం, ఆంధ్రా, సీడెడ్‌, ఓవ‌ర్సీస్‌, క‌ర్ణాట‌క ఇలా ఏ ఏరియా చూసుకున్నా బాల‌య్య కేరీర్ వ‌ర‌కు శాత‌క‌ర్ణి తిరుగులేని రికార్డుల‌ను త‌న ఖాతాలో వేసుకుంటోంది.

ఈ నెల 12న రిలీజ్ అయిన శాత‌క‌ర్ణి బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఫ‌స్ట్ వీకెండ్ (తొలి 4 రోజులు) లో ఏపీ, తెలంగాణ‌లో రూ 25.5 కోట్ల షేర్ రాబ‌ట్టిన ఈ సినిమా ఓవ‌ర్సీస్‌లో 1.2 మిలియ‌న్ డాల‌ర్ల మార్క్ క్రాస్ చేసి 1.5 మిలియ‌న్ డాల‌ర్ల వైపు ప‌రుగులు పెడుతోంది.

ఇక ఏపీ, తెలంగాణ‌లో ఏరియాల వారీగా చూస్తే శాత‌క‌ర్ణి నైజాం ఏరియాలో రూ 6.6 కోట్ల షేర్ రాబ‌ట్టింది. ఇది బాల‌య్య కేరీర్‌లోనే బిగ్గెస్ట్ రికార్డుగా నిలిచింది. మిగిలిన ఏరియాల్లో బాల‌య్య‌కు బాగా ప‌ట్టున్న సీడెడ్‌లో రూ 5.4 కోట్లు, నెల్లూరులో రూ 1.24 కోట్లు, గుంటూరులో 3.07 కోట్లు, కృష్ణాలో 2.02 కోట్లు, వెస్ట్‌లో 2.43 కోట్లు, ఈస్ట్‌లో 2.08 కోట్లు, ఉత్త‌రాంధ్ర‌లో 2.66 కోట్లు కొల్ల‌గొట్టింది. ఓవ‌రాల్‌గా అన్ని ఏరియాల్లోను బాల‌య్య గ‌త సినిమాల రికార్డులు బ్రేక్ అయ్యాయి.

ఇక ఓవ‌ర్సీస్‌లో బాల‌య్య సినిమాలు గ‌తంలో ఎప్పుడూ మిలియ‌న్ మార్క్‌ను ట‌చ్ చేయ‌లేదు. శాత‌క‌ర్ణి కేవ‌లం నాలుగు రోజుల‌కే 1.2 మిలియ‌న్ డాల‌ర్లు వ‌సూలు చేసింది. ఓవ‌రాల్‌గా తొలి నాలుగు రోజుల్లో శాత‌క‌ర్ణి రూ.35 కోట్ల షేర్‌తో పాటు రూ.50 కోట్ల‌కు పైగా గ్రాస్ వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇది బాల‌య్య కేరీర్‌లోనే తిరుగులేని రికార్డుగా నిలిచింది.