శ‌శిక‌ళ సీఎం కాకుండా అడ్డుకుంది ఎవ‌రు..?

త‌మిళ‌నాడు సీఎంగా ఉన్న జ‌య‌ల‌లిత మృతి చెంద‌డంతో ఆమె స్థానంలో ఆమెకు న‌మ్మిన‌బంటు ప‌న్నీరు సెల్వం సీఎం అయ్యారు. జ‌య‌ల‌లిత త‌ర్వాత ఆమెకు ఎంతో స‌న్నిహితురాలు, అమ్మ నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళ అమ్మ ప్లేస్‌ను ఎందుకు ఆక్ర‌మించ‌లేదు అన్న ప్ర‌శ్న‌లు ఇప్పుడు త‌మిళ‌నాట పెద్ద చ‌ర్చ‌కు తెర‌దీశాయి. ఎంజీఆర్ చ‌నిపోయిన‌ప్పుడు ప‌క్క‌నే ఉన్న జ‌య పార్టీలో ఎన్నో అవ‌మానాలు ఎదుర్కొన్నారు.

ముందుగా జ‌య‌ను ప‌క్క‌న పెట్టేశారు. ఎంజీఆర్ స‌తీమ‌ణి జాన‌కీ రాంచంద్ర‌న్ సీఎం అయ్యారు. ఆ త‌ర్వాత ఆమె స్థానంలో ప‌గ్గాలందుకున్న జ‌య అన్నాడీఎంకేలో తిరుగులేని స్థానం ఆక్ర‌మించ‌డంతో పాటు ఏకంగా 6 సార్లు సీఎంగా ఎన్నికై రికార్డులు క్రియేట్ చేశారు. ఇదిలా ఉంటే జ‌య‌ల‌లిత చ‌నిపోయిన వెంట‌నే ప‌న్నీరు సెల్వం అప్ప‌టిక‌ప్పుడు ఆక‌స్మికంగా సీఎంగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు.

ప‌న్నీరు సెల్వాన్ని అప్ప‌టిక‌ప్పుడు సీఎం పీఠం ఎక్కించ‌డం వెన‌క మోడీ – వెంక‌య్య మంత్రాంగం ఉన్న‌ట్టు త‌మిళ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కాంగ్రేసేత‌ర రాష్ట్రాల్లో ఎంట‌ర్ అయ్యి అక్క‌డ ప‌రిణామాలు త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే అవ‌కాశాల కోసం వెయిట్ చేస్తోన్న బీజేపీ త‌మిళ‌నాడులో కూడా సొంతంగా ఎదిగేందుకు గ‌త నాలుగేళ్లుగా ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది.

క‌రుణ కాంగ్రెస్‌తో జ‌ట్టు క‌ట్ట‌గా బీజేపీకి జ‌య‌ల‌లిత ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. గ‌త ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే ఏకంగా 39 స్థానాల‌కు గాను 37 చోట్ల విజ‌యం సాధించింది. బీజేపీకి అక్క‌డ అస్స‌లు ప‌ట్టులేదు. దీంతో తాజా ప‌రిణామాల‌ను త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చుకునేందుకు మోడీ, వెంక‌య్య క‌లిసి జ‌య అనారోగ్యంగా ఉన్న‌ప్ప‌టి నుంచి ప్ర‌తి అంశంలో ఎంతో చ‌తుర‌త ప్ర‌ద‌ర్శించారు. జ‌య కోసం ప్ర‌త్యేకంగా ఢిల్లీ నుంచి వైద్యుల‌ను కూడా చెన్నైకు పంపారు.

ఈ క్ర‌మంలోనే ప‌న్నీరుసెల్వంతో గ‌త రెండు నెల‌లుగా బీజేపీ పెద్ద‌లు..ఇంకా చెప్పాలంటే మంత్రి వెంక‌య్య ట‌చ్‌లో ఉంటూ ప‌న్నీరు సెల్వంను త‌మ వైపున‌కు తిప్పుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించేశార‌ట‌. ఈ క్ర‌మంలో జ‌య త‌ర్వాత

శ‌శిక‌ళ అన్నాడీఎంకే పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇస్తే మ‌ళ్లీ ఇక్క‌డ సీన్ ఎలా మారుతుందోన‌ని ముంద‌స్తు ప్లాన్‌తోనే మోడీ – వెంక‌య్య ప‌న్నీరు సెల్వంను సీఎం పీఠం ఎక్కేలా చేశార‌న్న గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.