శ‌శిక‌ళ ఫ్యామిలీ కేబినెట్ ఇదే

అదేంటి? శ‌శిక‌ళ ఎప్పుడు సీఎం అయింది? అని ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారా?! ఇంకా కాలేదు. ఇది నిజం. కానీ, ఎప్ప‌టికైనా అంటే ఓ ఆర్నెల్లో మ‌రో ఏడాదికైనా ఆమె ముఖ్య‌మంత్రి అయ్యే ఛాన్స్ లేక‌పోలేద‌ని త‌మిళ‌నాడులో పొలిటిక‌ల్ టాక్‌. ప్ర‌స్తుతానికి ప్ర‌జ‌ల నుంచి ఎలాంటి వ్య‌తిరేకతా రాకుండా ఉండేందుకు అమ్మ‌కు న‌మ్మిన బంటు అయిన ప‌న్నీర్ సెల్వానికి ప‌గ్గాలు అప్ప‌గించారు. కానీ, అన్నాడీఎంకే పార్టీ ప‌గ్గాలు మాత్రం శ‌శిక‌ళ త‌న‌ద‌గ్గ‌రే పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఆమె ఎప్ప‌టికైనా సీఎం అవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌నే టాక్ వినిపిస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఒక‌వేళ శ‌శిక‌ళ సీఎం అయితే.. అనే దిశ‌గా అప్పుడే చ‌ర్చ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. ఈ నేప‌థ్య‌లోనే ఆమెకు మంత్రివ‌ర్గం ఎలా ఉంటుంది? ఎవ‌రెవ‌రిని తీసుకుంటుంది? అనే విష‌యంపైనా ఆశ‌క్తిక‌ర చ‌ర్చ జ‌రుగుతోంది. దీనిని చూస్తే.. అమ్మ‌కు నెచ్చెలిగా ఉన్న శ‌శిక‌ళ ఎలాగో.. శ‌శిక‌ళ‌కి కూడా త‌మ బంధువుల్లో ఒక‌రు బాగా క్లోజ్ అంట‌! ఆమె పేరు ఇళ‌వ‌ర‌సి. ఈమె శ‌శిక‌ళ‌కి వ‌దిన! వ‌దిన గీసిన గీత దాట‌కుండా న‌డుచుకోవ‌డం శ‌శిక‌ళ క‌ర్త‌వ్యంగా చెన్నైలో ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలోనే జ‌య పార్థివ దేహం చుట్టూ.. ఇళ‌వ‌ర‌సి, ఆమె బంధువులు తిష్ట‌వేసి.. జ‌య అస‌లు బంధువుల‌ను క‌నీసం చూడ‌ను కూడా చూడకుండా చ‌ర్య‌లు తీసుకున్నార‌ట‌.

దీంతో రేపోమాపో శ‌శిక‌ళ‌.. సీఎం అయితే, ఈ ఇళ‌వ‌ర‌సి వ‌ర్గ‌మే మంత్రివ‌ర్గంలోకి చేరిపోవ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని తెలుస్తోంది. అయితే, వీళ్లేమ‌న్నా ఒక‌రిద్ద‌రున్నార‌ని అనుకుంటే త‌ప్పులోకాలేసిన‌ట్టే!! ఇళ‌వ‌ర‌సి వ‌ర్గం మొత్తం 17 మంది ఉన్నారు. దీంతో ఇక‌, పెద్ద‌గా బ‌య‌టి వాళ్ల‌ని ఎవ‌రినీ తీసుకోకుండా.. ప‌టిష్ట‌మైన మంత్రివ‌ర్గంతో శ‌శి పాల‌న సాగించేయొచ్చ‌నే వ్యంగ్య వ్యాఖ్య‌లు విన‌బ‌డుతున్నాయి. మ‌రి ఆ ఇళ‌వ‌ర‌సి వ‌ర్గం ఎవ‌రో చూద్దామా..

డాక్టర్ వెంకటేశన్ (శశికళ అన్న కొడుకు), దినకరన్ (శశికళ అక్క కొడుకు), దివాకరన్ (శశికళ తమ్ముడు), శశికళ, పి. భాస్కర్ (డాక్టర్ వెంకటేశన్ మామ), ఇళవరసి (శశికళ వదిన), వివేక్ (ఇళవరసి కొడుకు), కార్తికేయన్ (ఇళవరసి అల్లుడు), ప్రియ (ఇళవరసి కూతురు), జై ఆనంద్ (దివాకరన్ కొడుకు), విక్రమ్ (దివాకరన్ అల్లుడు), భాస్కరన్ (శశికళ అక్క కొడుకు), మధన్ (ఇళవరసి అన్న వడుగనాదన్ కొడుకు), రాజరాజన్ (ఇళవరసి అల్లుడు), డాక్టర్ శివకుమార్ (శశికళ అన్నకు అల్లుడు), మహాదేవన్ (శశికళ అన్న కొడుకు), నటరాజన్ (శశికళ భర్త). సో.. వీరంతా రాబోయే(ప్ర‌స్తుతానికి ఊహే) శ‌శిక‌ళ ప్ర‌భుత్వంలో మంత్రుల‌న్న‌మాట‌!!