జ‌గ‌న్‌తో పొత్తు కోసం ఆ పార్టీ త‌హ‌త‌హ‌

ఏంటి ఆశ్చ‌ర్యంగా ఉందా?! కాంగ్రెస్‌ని, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. నానా తిట్లు తిట్టి.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్మించి.. ఆమెను ఎదిరించి.. కాంగ్రెస్‌కి హ్యాండిచ్చి.. సొంత కుంప‌టి షురూ చేసి.. ఏపీలో కాంగ్రెస్ పార్టీ అడ్ర‌స్ లేకుండా పోవ‌డానికి కార‌ణ‌మైన వైకాపా అధినేత జ‌గ‌న్‌తో పొత్తు కోసం కాంగ్రెస్ త‌హ‌త‌హ లాడుతోందంటే.. ఎవ‌రికైనా ఆశ్చ‌ర్యం క‌ల‌గ‌క‌మాన‌దు! ఇప్ప‌టికిప్పుడున్న స‌మాచారం ప్ర‌కారం అయితే, జ‌గ‌న్‌తో పొత్తు మాత్ర‌మే కాదు… కాంగ్రెస్ భావి సీఎంగా కూడా జ‌గ‌న్‌ను ప్ర‌క‌టించ‌నుంద‌నే సంకేతాలు వెలువడుతున్నాయి.

పాలిటిక్స్‌లో ఎవ‌రు ఎవ‌రికీ శ‌త్రువులు కారు.. ఎవ‌రి అవ‌స‌రాలు వారివి! అధికారం కోసం ఏమైనా జ‌రుగుతున్న ప్ర‌స్తుత కాలంలో నేడు పొగిడిన నోళ్లే..రేపు తిట్టినా.. నేడు తిట్టిన నోళ్లే.. రేపు పొగిడినా.. వాటిని రాజ‌కీయాలుగా స‌రిపెట్టుకోవాలి త‌ప్ప‌.. లోతుల్లోకి ఎవ్వ‌రూ వెళ్లిపోరు. ఇప్పుడు ఏపీలోనూ జ‌గ‌న్ విష‌యంలో కాంగ్రెస్ ఇదే పంథాను అనుస‌రిస్తోంది. ఇప్ప‌టికే నామ‌రూపాలు లేకుండా పోయిన జాతీయ పార్టీ.. పోనీ2019 నాటికి పుంజుకుని ప‌ట్టు సాధిస్తుందా? అంటే.. వెయ్యి డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. మొన్నామ‌ధ్య పీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరా రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో ప‌ట్టుమ‌ని ప‌ది మంది కూడా పాల్గొన‌లేదంటే.. ప‌రిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.

ఇలాంటి పార్టీకి జ‌వ‌స‌త్వాలు అందించే స‌త్తా ఉన్న నేత అవ‌స‌రం! ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం దీనిపైనే దృష్టి పెట్టింది. ఈ క్ర‌మంలోనే జ‌గ‌న్ మెరుపుతీగ‌లాగా క‌నిపించాడ‌ని తెలుస్తోంది. తొలుత జ‌న‌సేనాని ప‌వ‌న్‌తో జ‌త క‌ట్టాల‌ని భావించినా.. ఇప్ప‌టికీ పూర్తిస్థాయిలో పుంజుకోని, సిద్ధాంతాలేమిటో తెలియ‌ని పార్టీని క‌లుపుకొంటే బ్యాడ్ సిగ్న‌ల్స్ వెళ్తాయ‌ని గ‌మ‌నించిన కాంగ్రెస్ నేత‌లు.. నాడు పొమ్మ‌న్న జ‌గ‌న్‌నే నేడు ర‌మ్మ‌ని ఆహ్వానిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ప‌న‌బాక ల‌క్ష్మి చేసిన కామెంట్లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

జ‌గ‌న్ త‌మ పార్టీలో చేర‌గానే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తాం అని ప‌న‌బాక చెప్పారు. దీనిని బ‌ట్టి ఆ పార్టీలో నాయ‌క‌త్వ ప‌టిమ ఉన్న నేత కోసం మిగిలిన వారంతా ఎదురు చూస్తున్నార‌నే అనిపిస్తోంది. ఇక‌, వైకాపా సైడ్ ఆలోచిస్తే.. జ‌గ‌న్ కి ఇప్పుడు త‌క్ష‌ణావ‌స‌రంగా సీఎం సీటు కావాలి! గ‌తంలో 2014 ఎన్నిక‌ల్లో సొంతంగా సీటు కొట్టేద్దామ‌ని అనుకున్నా.. ఫ‌లితంచ‌లేదు. దీంతో ఇప్పుడు ఆయ‌న మ‌రెవ‌రినైనా కూడగ‌ట్ట‌యినా.. స‌రే.. బాబును గ‌ద్దెదించి.. ఏపీ సీఎం వ‌రుస‌లో రెండో ప్లేస్‌కి ఎక్కేయాల‌ని భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో ఆయ‌న ఇప్ప‌టికే వామ‌ప‌క్షాల‌తో మంచి ట‌చ్‌లోనే ఉన్నారు. ఇక‌, కాంగ్రెస్‌తోనూ ఓకే అంటే.. దాదాపు సీఎం సీటు 80% ఖాయ‌మ‌ని ఆయ‌న న‌మ్మకంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. అధికారం కోస‌మే రాజ‌కీయాలు కాబ‌ట్టి ఏం జ‌రిగినా ఆశ్చ‌ర్య ప‌డాల్సిన అవ‌స‌రం లేదు!!