దమ్ముంటే అసెంబ్లీ లో మాట్లాడు

తమిళ నాట రాజకీయాలు భలే చిత్రంగా ఉంటాయి.వ్యక్తి గత దూషణలు..కక్ష సాధింపు చర్యలు దేశం లో ఎక్కడా లేనంతగా తమిళనాడు లోనే మనం చూస్తుంటారం.ఇక జయలలిత,కరుణానిధి చిరకాల వైరం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.వారిది దశాబ్దాల కాలం నుండి కొనసాగుతున్న వ్యక్తిగత వైరం.ఎవరు అధికారంలో ఉన్నా అవతలి వాళ్ళను ముప్పతిప్పలు పెట్టడం ఖాయం.

అయితే వరుసగా రెండో సారి ముఖ్యమంత్రి అయిన జయలలిత ఈ సారి కరుణానిధి అండ్ డీఎంకే పార్టీ పై కొంచెం మతవైఖరితో వుంటూ వచ్చారు ఇప్పటి దాకా.దీన్ని అలుసుగా తీసుకున్న డీఎంకే శాసన సభ్యులు రెచ్చిపోవడం ప్రారంభించారు.ఇంకేముంది అమ్మ కన్నెర్ర జేసింది.కట్ చేస్తే మొత్తం 79 మంది డీఎంకే శాసనసభ్యుల్ని వారం రోజులపాటు సస్పెండ్.దీనిపై డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు.

అయితే కరుణకు జయ కౌంటర్ గట్టిగానే ఇచ్చింది.దమ్ముంటే అసెంబ్లీ కి వచ్చి మాట్లాడాలని సవాల్ విరింది జయలలిత.ఏం డీఎంకే హయాంలో అన్నాడీఎంకే సభ్యులంతా సస్పెండైనప్పుడు తాను ఒంటరిగా సభకు వెళ్లి ప్రసంగించలేదా.ఇప్పుడు కూడా డీఎంకే సభ్యులు 79 మంది సస్పెండ్ అయినా కరుణానిధి సస్పెండ్ కాలేదు కదా.అలాంటప్పుడు అసెంబ్లీ కి వచ్చి చర్చలో పాల్గొనే దమ్ము కరుణానిధి కి లేదా అని సవాల్ చేశారు.