హరీష్‌, కేటీఆర్‌లలో ఎవరికి దక్కేనో!

మంత్రులు హరీష్‌రావు, కేటీఆర్‌ల మధ్య విపరీతమైన పోటీ ఉంది. వీరిలో హరీష్‌రావు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌కి మేనల్లుడు. కేటీఆర్‌ అయితే కెసియార్‌ తనయుడే. ఇద్దరూ మంత్రులే. తెలంగాణ రాష్ర సమితి పార్టీకి వీరిద్దరూ ముఖ్యమైన వ్యక్తులు, మూలస్తంభాల్లాంటివారు. ఇద్దరిలో కెటియార్‌ ఒకింత ఎక్కువ.

ముఖ్యమైన శాఖలన్నీ కెటియార్‌ వద్దనే ఉన్నాయి. కానీ కెటియార్‌కి ఇంకో ముఖ్యమైన బాధ్యతలు అప్పగించాలని చూడటం ద్వారా హరీష్‌రావుని ఇంకా తక్కువ చెయ్యాలనుకుంటున్నారట ముఖ్యమంత్రి కెసియూర్‌. అదెలాగంటే బాధ్యతలు పెరిగే కొద్దీ పవర్‌ పెరుగుతంది, తద్వారా హరీష్‌రావు ఉన్న పదవులతోనే సరిపెట్టుకోవలసి వస్తుంది. బాధ్యతలు మోయలేక హరీష్‌రావు ఇప్పటికే కొన్ని శాఖలను వదులుకున్నారు.

కెటియార్‌ అలా కాదు, ఎన్ని పదవులు ఇచ్చినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తానంటున్నారు. కొత్తగా కెటియార్‌కి రానున్న ఆ పదవి ఇంకేదో కాదు సాక్షాత్తూ హోంమంత్రి పదవి అని సమాచారమ్‌. నాయని నర్సింహారెడ్డి ఈ పదవిలో ఉండగా, ఆయన ఆ పదవిని నిర్వహిచడం కష్టమని భావిస్తుండడంతో, ఆ పదవిని కెటియార్‌కి ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసియార్‌ అనకుంటున్నారు.

ఏ రాష్ట్రానికి అయినా హోంశాఖ పదవి అత్యంత కీలకమైనది. ముఖ్యమంత్రి పదవి తర్వాత హోంమంత్రి పదవికే ఆ స్థాయి గుర్తింపు ఉందని అంటారు. ఆ పదవి కెటియార్‌కి దక్కితే, హరీష్‌రావు తెలంగాణ మంత్రి వర్గంలో ‘నామమాత్రం’ అయిపోవడం ఖాయం. అందుకే హోంమంత్రి పదవి విషయంలో కెటియార్‌ని హరీష్‌రావు వ్యతిరేకిస్తున్నారట. హరీష్‌ – కెటియార్‌ మధ్య హోంమంత్రి పోరులో ఎవరు విజేత అవుతారో చూడాలిక.