బాబు సంపాదన ఎంతో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వార్షికాదాయం రూ. 36 లక్షలు. సిఎంతో సహా ఆయన ఐదుగురు కుటుంబ సభ్యుల ఆధార్, ఓటర్ ఐడీ అన్నీ హైదరాబాద్‌లో ఉండగా స్థిర, చరాస్తులు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. తొలిరోజు స్మార్ట్ పల్స్ సర్వేను ముఖ్యమంత్రి ఉండవల్లిలోని తన నివాసం నుంచి ప్రారంభించారు. తొలుత ఎన్యుమరేటర్లు ముఖ్యమంత్రికి సంబంధించిన వివరాలు సేకరించారు. సిఎంగా తనకు వచ్చే ఆదాయం అన్నింటితో కలుపుకుని రూ. 36 లక్షలని చంద్రబాబు ఎన్యుమరేటర్లకు వివరించారు.

తన స్వగ్రామం చిత్తూరుజిల్లా నారావాలిపల్లెలో స్థిర, చరాస్తులు ఉన్నాయని, అయితే వీటి వివరాలను తరువాత చెప్తానని తెలిపారు. కాగా సిఎం ఆధార్ కార్డు నెం. 300300688099, ఓటర్ ఐడీ నెం. ఎఫ్‌ఐవి 2036739 ప్రకారం ఎన్యుమరేటర్లకు వివరాలను విశదీకరించారు. అయితే ఓటర్ ఐడీతో పాటు ఆధార్ కార్డు హైదరాబాద్‌లో నివసిస్తున్నట్లుగానే ఉన్నందున వాటిని బదిలీ చేయించాల్సి ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. సిఎం చెప్పిన కొన్ని వివరాలను నమోదు చేసుకున్న ఎన్యుమరేటర్లు పల్స్ ఏడబ్ల్యుకెపీ 202963 నెంబరుగా ప్రకటించారు.