నిన్న అరెస్టైన‌ కేంద్రమంత్రికి నేడు బెయిల్..మ‌రి నెక్స్ట్ ఏంటో?

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టేవాడ్ని అంటూ వివాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డంతో నిన్న కేంద్ర‌మంత్రి నారాయ‌ణ్ రాణెను పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర మంత్రిని అరెస్ట్‌ చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అయితే నిన్న అరెస్ట్ అయిన కేంద్ర‌మంత్రికి ఈ రోజు బెయిల్ మంజూరు అయింది. పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కేందమంత్రిని అరెస్టు చేశారని .. దీని వెనక రాజకీయ కుట్ర ఉందని నారాయణ్‌ రాణె తరపు న్యాయవాదులు వాదించారు. […]