అంత దారుణ హత్యకు.. ఆత్మరక్షణ ముసుగు!

గుంటూరు జిల్లా గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే తెలుగుదేశానికి చెందిన వ్యక్తి దారుణంగా నడిరోడ్డులో హత్యకు గురైన సంగతి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. హత్యకేసులో ప్రధాన నిందితుడు వెల్దుర్ది మండలానికి ఎంపీపీ కూడా కావడంతో ఇది ఖచ్చితంగా రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలు కొనసాగిస్తోంది.. తెలుగుదేశం పార్టీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. చంద్రబాబునాయుడు స్వయంగా తోటచంద్రయ్య అంత్యక్రియల్లో కూడా పాల్గొని పాడె మోసి.. వైసీపీ నాయకుల్ని ఖబడ్దార్ అంటూ హెచ్చరించడం కూడా […]