కాంగ్రెస్ నుంచి విజ‌య‌శాంతి జంప్‌….ఆ పార్టీలోకేనా…!

ప్ర‌ముఖ సినీ న‌టి, ప్ర‌స్తుత కాంగ్రెస్ నేత విజ‌య‌శాంతి మ‌ళ్లీ పార్టీ మారుతున్నారా ? ఆమె కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పేసి, తెలంగాణ పాలిటిక్స్‌ను వ‌దిలేసి త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో కీల‌కంగా మార‌బోతున్నారా ? అంటే తాజా ప‌రిణామాలు అవున‌నే స్ప‌ష్టం చేస్తున్నాయి. గ‌తంలో ప‌లు పార్టీలు మారిన విజ‌య‌శాంతి ఇప్పుడు ఏకంగా స్టేటే మారిపోతున్నారు. ప్ర‌త్యేక తెలంగాణ కోసం త‌ల్లి తెలంగాణ పార్టీ స్థాపించి త‌ర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేసిన ఆమె ఆ పార్టీ […]

ఏ క్షణంలోనైనా కూలిపోనున్న ప‌ళ‌నిస్వామి ప్రభుత్వం

ఏమంటా త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌ల‌లిత మృతిచెందారో అప్ప‌టి నుంచి త‌మిళ రాజ‌కీయం ఊర‌స‌వెల్లి రంగులు మార్చిన‌ట్టు మారిపోతోంది. జ‌య మృతి త‌ర్వాత ప‌న్నీరుసెల్వం సీఎం అవ్వ‌డం ఆ త‌ర్వాత ఎడ‌ప్ప‌డి ప‌ళ‌నిస్వామి సీఎం అవ్వ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. వాస్త‌వానికి జ‌య మృతి త‌ర్వాత ప‌ళ‌నిస్వామి సీఎం అయిన‌ప్ప‌టి నుంచి పార్టీని త‌న చేతుల్లోకి తీసుకునేందుకు చిన్న‌మ్మ శ‌శిక‌ళ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. చివ‌ర‌కు ఆమె అనూహ్యంగా జైలుకు వెళ్ల‌డంతో ఆమె అనుంగు అనుచ‌రుడు ప‌ళ‌నిస్వామి […]

ఓపీఎస్‌కు మ‌ద్దతు వెనుక బీజేపీ వ్యూహ‌మిదేనా

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో క‌ల‌గ‌జేసుకోబోమ‌ని ప్ర‌క‌టిస్తూనే.. రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ అనిశ్చితికి కారణం కాద‌ని చెబుతూనే.. గంద‌ర‌గోళ ప‌రిస్థితుల‌ను సృష్టిస్తోంది. రెండు వ‌ర్గాలుగా చీలిపోయిన ఓపీఎస్‌, ఈపీఎస్ వర్గాల‌ను మ‌ళ్లీ ఒక్క‌టిగా క‌ల‌వ‌డం వెనుక కేంద్రం జోక్యం ఉంద‌ని స్ప‌ష్టంగా తెలుస్తోంది. అలాగే ప‌న్నీర్ సెల్వాన్ని తిరిగి సీఎం పీఠంపై నిలిపేందుకు కూడా మంత‌నాలు జ‌రుపుతోంది. దీని వెనుక పెద్ద మాస్ట‌ర్ ప్లాన్ ఉంద‌నే చ‌ర్చ ఇప్పుడు జోరుగా వినిపిస్తోంది. త‌మిళ‌నాడులో […]

త‌మిళ తెరపై కాషాయ సినిమా మొద‌లైందా..?

త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను తెర వెనుక నుంచి న‌డ‌పాల‌ని ఎప్ప‌టినుంచో వ్యూహాలు ర‌చిస్తున్న బీజేపీ.. ఎట్ట‌కేలకు విజ‌యం సాధించింది. న‌యానో భ‌యానో చివ‌రికి ప‌రిస్థితుల‌ను త‌న చెప్పుచేతల్లోకి తెచ్చుకుని స‌క్సెస్ అయింది. త‌న మార్క్ వ్యూహంతో కేంద్రం ప‌క్కాగా.. శ‌శిక‌ళ వ‌ర్గాన్ని త‌మిళ రాజ‌కీయాల నుంచి సైడ్ అయిపోయేలా చేసింది. ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక వాయిదా వేయ‌డం మొద‌లుకుని.. సీఎం ప‌ళ‌నిస్వామి నేరుగా మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వంతో క‌లిసేలా చేసి త‌మిళ రాజ‌కీయాల‌ను శాసించే స్థాయికి […]

త‌మిళ‌నాట మ‌రోసారి రాజ‌కీయ సంక్షోభం?

త‌మిళనాడు సీఎం పీఠాల‌ని ఎక్కాల‌ని భావించి భంగ‌ప‌డి.. జైలులో ఊచ‌లు లెక్క‌బెడుతున్న‌ శ‌శిక‌ళ‌కు ఊహించ‌ని షాక్ ఎదుర‌వబోతోంది. తాను లేక‌పోయినా.. త‌న వ‌ర్గ‌పు వారిని పార్టీ కార్య‌ద‌ర్శిగా నియ‌మించి అక్క‌డి నుంచే చ‌క్రం తిప్పాల‌ని భావించిన ఆమెకు.. అన్నాడీఎంకే మంత్రులు ఝ‌ల‌క్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌ను ఆ పదవి నుంచి తొలగించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్త‌య్యాయి. అంతేగాక ఇందుకు సంబంధించి ప‌క్కా స్కెచ్ కూడా వీరు […]

విజ‌య‌శాంతి తెలంగాణ‌లో కాంగ్రెస్ – త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే

త‌మిళ‌నాడు దివంగ‌త మాజీ సీఎం జ‌య‌లలిత మృతి త‌ర్వాత త‌మిళ‌నాడు రాజ‌కీయాలు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవ్వ‌రూ ఊహించ‌లేక‌పోతున్నారు. ఎవ‌రికి వారు పార్టీ పెట్టేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే అమ్మ మృతితో ఖాళీ అయిన ఆర్‌కె.న‌గ‌ర్ అసెంబ్లీ స్థానానికి జ‌రుగుతోన్న ఉప ఎన్నిక ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌లు పార్టీలు మారిన టాలీవుడ్ లేడీ సూప‌ర్‌స్టార్ విజ‌య‌శాంతి ఈ ఉప ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేస్తున్నారు. ఇంత‌కు విజ‌య‌శాంతి అక్క‌డ ఎవ‌రి త‌ర‌పున ప్ర‌చారం చేస్తున్నాడో […]

`టోపీ` కేటాయింపుపై శశికళ ఆగ్రహం

అమ్మ జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌ర్వాత‌.. ఆమె నెచ్చెలి శ‌శిక‌ళ‌కు వ‌రుస‌గా ఎదురుదెబ్బ‌లు తగులుతూనే ఉన్నాయి. ఎంతో ఆశ‌ప‌డిన‌ సీఎం పీఠం చేజారిపోగా ఇప్పుడు క్ర‌మ‌క్ర‌మంగా పార్టీపైనా ఆమె ప‌ట్టుకోల్పోతోంద‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం జ‌య‌లలిత నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఆర్‌కే న‌గ‌ర్‌లో పోటీకి సిద్ధ‌మ‌వుతున్న వేళ‌.. శ‌శిక‌ళ‌కు షాక్ త‌గిలింది. అన్నాడీఎంకే పార్టీ గుర్తు రెండాకుల చిహ్నం ఎవ‌రికీ ద‌క్క‌క‌పోవ‌డం శ‌శిక‌ళ‌ను తీవ్రంగా క‌లిచివేస్తోంద‌ట‌. అంతేగాక న‌మ్మి పార్టీని అప్ప‌గిస్తే.. ఇలా చేసినందుకు ఉప ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి దిన‌క‌ర‌ణ్‌పై తీవ్ర […]

ప‌ళ‌నిపై క‌క్ష సాధింపుల‌కు కేంద్రం స్కెచ్ రెడీ

అమ్మ మ‌ర‌ణం త‌ర్వాత‌ త‌మిళ‌నాడులో ప‌ట్టు సాధించాల‌ని… మాజీ సీఎం ప‌న్నీర్ సెల్వాన్ని ముందుంచి తాము వెనక నుంచి చ‌క్రం తిప్పాల‌ని భావించిన కేంద్రం ఆశ‌ల‌కు ప‌ళ‌నిస్వామి రూపంలో గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. శాస‌న‌స‌భ‌లో జ‌రిగిన బ‌ల‌ప‌రీక్ష‌లో ప‌ళ‌నిస్వామి విజ‌యం సాధించ‌డంతో సైలెంట్ అయిపోయింది. అయితే `ఇంత‌టితో అయిపోలేదు, నిన్ను వ‌దిలిపెట్టేది లేదు` అంటోంది కేంద్రం. ఎంతో కాలం ఆ స్థానంలో కూర్చోలేవు అంటూ పరోక్షంగా హెచ్చ‌రిక‌లు జారీచేస్తోంది. ఆయ‌న గ‌త చ‌రిత్ర‌ను త‌వ్వి.. లొసుగుల‌ను బ‌య‌ట‌కు […]