దేశంలోనే తొలిసారిగా తెలంగాణ కీల‌క నిర్ణ‌యం యుద్ధ విమానాల్లో..

కరోనా సెకండ్ వేవ్ కారణంగా ప్రాణవాయువు (ఆక్సిజన్) కొరతతో దేశవ్యాప్తంగా వైద్య‌శాల‌ల్లో చికిత్స పొందుతున్న కొవిడ్ పేషెంట్ల బాధలు చెప్పలేనివి కావు. మునుపెన్నడూ చూడని విధంగా దేశంలో రోజుకు 1500 కు మించి మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో కొద్దిరోజులుగా ఈ తరహా మరణాలు పెరుగుతున్న తరుణంలో ఆక్సిజన్‌కు విపరీతంగా డిమాండ్ పెరిగింది. ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల నుంచి టన్నుల కొద్దీ వాయువును ఆస్పత్రులకు తరలిస్తున్నా అదీ సరిపోవడం లేదు. యుద్ధ‌ప్రాతిప‌దిక ఆక్సిజ‌న్ త‌ర‌లింపున‌కు చ‌ర్య‌లు చేప‌డుతున్నారు. అందులో […]

600 మంది సిబ్బందికి కరోనా.. ఎస్‌బీఐ కీల‌క నిర్ణ‌యం

క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. మొద‌టి విడ‌త కంటే రెండో విడ‌త‌లో సుడిగాలిలా జ‌నాన్ని చుట్టేస్తున్న‌ది. ప‌దుల సంఖ్య‌లో ఉద్యోగులు వైర‌స్ బారిన ప‌డుతున్నారు. కరోనా రెండో వేవ్‌లో తెలంగాణ వ్యాప్తంగా కేవ‌లం ఒక్క ఎస్‌బీఐకి చెందిన 600 మంది ఉద్యోగులు కొవిడ్ బారిన ప‌డ‌డం ప‌రిస్థితి తీవ్ర‌త‌కు అద్దం ప‌డుతున్న‌ది. ఈ నేప‌థ్యంలోనే కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ఎస్బీఐ సీజీఎం ఓపీ మిశ్రా ప్రకటన విడుదల చేశారు. ఖాతాదారులతో నేరుగా సంబంధాలు ఉన్న ఉద్యోగులే కొవిడ్ […]

టాలీవుడ్ లో విషాదం… ప్రముఖ నిర్మాత మృతి..!

ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా విజృంభిస్తున్న తరుణంలో రోజు రోజుకు కొన్ని లక్షల కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. ఇప్పుడు ఈ కరోనా వైరస్ ప్రభావం టాలీవుడ్ పై కూడా పడింది. ఇప్పటికే ఎంతో మంది సినీ నటీనటులు ఇంకా ప్రముఖులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఇప్పుడు తాజాగా కరోనా వైరస్ తో నిర్మాత సి.ఎన్.రావు మృతి చెందారు. కరోనా వైరస్ బారిన పడి నిర్మాత మృతి చెందిన సి.ఎన్.రావు అలియాస్ చిట్టి […]

భార‌త్‌లో కరోనా‌పై సీసీఎంబీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌

భార‌త్‌లో క‌రోనా తీవ్రతరం అవుతోందని, వైరస్ ఎప్పటికప్పుడు ఉత్పరివర్తనం చెందుతోందని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. వచ్చే మూడు వారాలు దేశానికి కీలకమని.. వైరస్ వ్యాప్తిని అరికట్టాలంటే ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కొవిడ్‌ కేసులు పెరిగేకొద్దీ దేశంలో మరికొన్ని కొత్తరకం కరోనా వైరస్‌లు ఉద్భవించే అవకాశం ఉందని సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) అప్రమత్తం చేసింది. వచ్చే మూడు వారాలు భారత్‌కు కీలకమని.. వైరస్‌ […]

ప్రైవేట్ ద‌వాఖాన నిర్వాకం.. బిల్లు క‌ట్ట‌లేద‌ని..

క‌రోనా మ‌హ‌మ్మారి ఒక‌వైపు విజృంభిస్తున్న‌ది. ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లితీసుకుంటున్న‌ది. జ‌నం బ‌య‌ట అడుగుపెట్టాలంటేనే జంకుతున్నారు. ఇదే అదునుగా ప‌లు ప్రైవేట్ వైద్య‌శాల‌లు చెల‌రేగిపోతున్నాయి. మూలిగే న‌క్క మీద తాటికాయ ప‌డిన చందంగా ఇప్ప‌టికే కొవిడ్ కార‌ణంగా ఉపాధి, ఉద్యోగాల‌ను కోల్పోయి ఆర్థికంగా చితికిపోయిన ప‌రిస్థితుల్లోనూ జ‌నాల ర‌క్తాన్ని పీల్చుతున్నాయి. ట్రీట్‌మెంట్ పేరిట దోచుకుంటున్నాయి. ప్రైవేట్ ద‌వాఖాన‌ల దాష్టికానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. హైద‌రాబాద్‌లోని అల్వాల్ కి చెందిన రామారావు అనే పెద్దాయన ఇటీవ‌ల అస్వ‌స్థ‌త‌కు […]

క‌రోనా పేషంట్‌.. అందులోనూ వృద్ధురాలు.. అయినా వ‌ద‌ల‌నీ కామాంధుడు..

ఎన్ని క‌ఠిన చ‌ట్టాలు తీసుకొచ్చినా మృగాళ్లు మాత్రం మార‌డం లేదు. ఆడ‌బిడ్డ‌ల‌కు కండ్ల ప‌డితే చాలు మీద‌ప‌డేస్తున్నారు. కామంతో కళ్లు మూసుకుపోయిన ఒక‌డు కరోనా పేషంట్ అని కూడా భయపడకుండా అత్యాచారానికి య‌త్నించాడు. వృద్ధురాలు అని కూడా చూడ‌కుండా బ‌రితెగించాడు. ఈ సంఘ‌ట‌న మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో వెలుగు చూసింది. వివ‌రాల్లోకి వెళ్తే.. గ్వాలియర్‌కు చెందిన ఓ 59ఏళ్ల మ‌హిళ ఇటీవ‌ల క‌రోనా బారిన ప‌డింది. దీంతో చికిత్స నిమిత్తం స్థానికంగా ఉన్న లోటస్ హాస్పిటల్‌లో చేరింది. […]

నాకు క‌రోనా.. సారీ చ‌చ్చిపోతున్నాఅంటూ పేరేంట్స్‌కు ఫోన్‌..

ఏడాది కాలంగా మాన‌వాళిని ప‌ట్టిపీడిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రోమారు అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న‌ది. ప్రాణాల‌ను పొట్ట‌న పెట్టుకుంటున్న‌ది. వైర‌స్ బారిన ప‌డినవారి సంగ‌తేమో కానీ, ఎక్క‌డ వ్యాధి సోకుంతుందోన‌ని ప్ర‌జ‌లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. వైర‌స్‌పై, నివార‌ణ చ‌ర్య‌ల‌పై అవ‌గాహ‌న లేని వారు వైర‌స్ సోకింద‌నే తెలియ‌గానే భ‌యంతో ప్రాణాల‌ను విడుస్తున్నారు. మ‌రికొంద‌రు ఒత్తిడిని త‌ట్టుకోలేక ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు. అందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది ఈ సంఘ‌ట‌న‌. క‌రోనా బారిన ప‌డిన ఓ యువ‌కుడు మాన‌సిక వేద‌న‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. ఈ […]

క‌రోనా టీకా విక‌టించి స‌ర్పంచ్ మృతి..!

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తున్నది. గత కొద్ది రోజులుగా లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు రికార్డవుతుండగా.. తాజాగా రెండు లక్షలకుపైగా నమోదయ్యాయి. గురువారం 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొవిడ్‌-19 బారిన పడి మరణించేవారి సంఖ్యా రోజురోజుకూ పెరుగుతోంది. మహమ్మారి బారినపడి మరో 1,038 మంది మృతువాతపడ్డారు. కరోనా మహమ్మారి మొదలైన నుంచి ఇంత పెద్ద మొత్తంలో మరణాలు నమోదవడం ఇదే తొలిసారి. గతేడాది అక్టోబర్‌ 18న […]

సినీ నిర్మాత బండ్ల గణేష్ కు కరోనా పాజిటివ్..!?

టాలీవుడ్ సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోకసారి కరోనా వచ్చింది. గత ఏడాది కూడా బండ్ల గణేష్ కి కరోనాసోకింది. ఆ తరువాత అయన దాని నుండి కోలుకున్నారు. ఇప్పుడు తాజాగా మరోకసారి కరోనా నిర్దారణ అయ్యింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగగా, దానికి బండ్ల గణేష్ హాజరయ్యారు. ఈ సమయంలోనే ఆయనకి కరోనా సోకిందని తెలుస్తుంది. ఈవెంట్ నుంచి ఇంటికి వెళ్ళాక ఆయనకి జ్వరం, ఒళ్ళు నొప్పులులతో బాధపడ్డాడు. ఆ […]