కర్నూలులో సైకిల్‌కు ఊపు..ఆ స్థానాల్లో వైసీపీకి చెక్..!

వైసీపీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త ఊపు కనిపిస్తోంది..ఈ మూడేళ్లలో వైసీపీపై పెరుగుతున్న వ్యతిరేకత కావచ్చు..ఎమ్మెల్యేలు సరిగ్గా పనిచేయకపోవడం లాంటి అంశాలు టీడీపీకి కలిసొస్తున్నాయి. జిల్లాలో 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్న విషయం తెలిసిందే..అయితే వాటిల్లో ఇప్పుడు కొన్ని టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. ఇక చంద్రబాబు పర్యటనతో మరింత ఊపు వచ్చింది. వాస్తవానికి కర్నూలులో టీడీపీకి అనుకున్నంత బలం లేదు..దీంతో బాబు పర్యటనకు పెద్ద స్పందన రాదేమో అనే పరిస్తితి..కానీ […]

ఆఖరి ఛాన్స్ అంటున్న బాబు..హామీలు షురూ..!

గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి తన పాలన ఎలా ఉంటుందో చూపిస్తానని జగన్ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక జగన్ పాలన ఎలా ఉందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆయన పాలనపై సంతృప్తి వ్యక్తం చేసే వారు ఉన్నారు..అసంతృప్తి వ్యక్తం చేసేవారు ఉన్నారు. కానీ జగన్ మాత్రం తన పాలనలో అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నారు. ఇటు చంద్రబాబు ఏమో జగన్ పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరని అనుకుంటున్నారు. ఎవరి వర్షన్ వారికి ఉంది. […]

బడా పత్రిక సర్వే..బాబుకు క్లారిటీ..!

ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉన్నా సరే…ఇప్పటినుంచే రాష్ట్రంలో ఎన్నికల సందడి కనిపిస్తోంది..ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైసీపీ-టీడీపీలు ముందుకెళుతున్నాయి. రకరకాల వ్యూహాలతో పార్టీలు వెళుతున్నాయి..అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని ఎంపిక చేసే ప్రక్రియ కూడా మొదలుపెట్టేశారు. ఇక ఎవరికి వారు సొంతంగా సర్వేలు నిర్వహించుకుంటున్నారు. అలాగే థర్డ్ పార్టీ సంస్థలు కూడా సర్వేలు చేస్తున్నాయి. ఇదే క్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద మీడియా, పత్రిక వ్యవస్థ కలిగిన ఈనాడు సంస్థ ఒ సర్వే చేసిందని ప్రచారం […]

జ‌గ‌న్ ప్ర‌సంగంపై విమ‌ర్శ‌లు.. వైసీపీలోనే హాట్ టాపిక్‌…!

ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఏపీలో ప‌ర్య‌టించారు. విశాఖ‌లో ఆయ‌న 10 వేల కోట్ల రూపాయ‌ల‌కు పైగా ప‌లు ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు చేశారు. అయితే. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో ఏపీకి సంబంధించిన స‌మ‌స్య‌ల‌పై సీఎం జ‌గ‌న్ ఆశించిన విధంగా రియాక్ట్ కాలేద‌ని.. పెద్ద ఎత్తున విమ ర్శ‌లు వ‌చ్చాయి. ప‌లు సంద‌ర్భాల్లో తెలుగును వ‌ద్ద‌ని.. ఇంగ్లీష్ ముద్ద‌ని చెప్పిన సీఎం జ‌గ‌న్‌.. అనూహ్యంగా మోడీ పాల్గొన్న స‌భ‌లో ఇంగ్లీష్‌లో కాకుండా.. తెలుగులో ప్ర‌సంగించ‌డం ఏంట‌నే విమ‌ర్శ‌లు […]

యాంటీ కమ్మ ఫార్ములా..పర్చూరులో వైసీపీ రివర్స్..!

రాష్ట్రంలో టీడీపీ కంచుకోటలని వైసీపీ గట్టిగా టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లోనే కొన్ని కోటలని కూల్చింది..ఈ సారి ఎన్నికల్లో మరికొన్ని కోటలని కూల్చాలని జగన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ స్ట్రాంగ్‌గా ఉన్న పర్చూరు స్థానాన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ టి‌డి‌పి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఉన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా సరే..ప్రజల్లోనే ఉంటూ, తన ఇమేజ్‌ని పెంచుకుంటూ వెళుతున్నారు. పార్టీ బలంతో పాటు ఇక్కడ తన సొంత బలం కూడా ఉండటం […]

విజయవాడ ఎంపీగా యార్లగడ్డ?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రాజకీయాలు అనేక మలుపులు తిరుగుతున్నాయి..అటు టీడీపీలో గాని, ఇటు వైసీపీలో గాని ట్విస్ట్‌లు వస్తున్నాయి. సీట్ల విషయంలో కన్ఫ్యూజన్ నడుస్తోంది. ఏ సీటులో ఎవరు బరిలో దిగుతారనేది క్లారిటీ ఇవ్వడం కోసం పార్టీ అధిష్టానాలు కష్టపడుతున్నాయి. ఇదే క్రమంలో గన్నవరం సీటు విషయంలో వైసీపీలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి దాదాపు గన్నవరం సీటు ఫిక్స్. అధిష్టానం క్లారిటీ ఇచ్చేసింది. ఇక ఈ సీటు […]

విశాఖ నార్త్ బరిలో కే‌కే ఫిక్స్..!

రాష్ట్రంలో ఎన్నికల సీజన్ మొదలైపోయింది…ఇంకా ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే..ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేనలు..ఎన్నికలే లక్ష్యంగా ముందుకెళుతున్నాయి. ముఖ్యంగా వైసీపీ-టీడీపీలు ఓ వైపు పదునైన వ్యూహాలతో ముందుకెళుతూనే, మరో వైపు నెక్స్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ స్థానాల్లో బలమైన అభ్యర్ధులని పెట్టడమే లక్ష్యంగా వెళుతున్నారు. ఇటు జగన్, అటు చంద్రబాబు..అసెంబ్లీ స్థానాల్లోని నేతలతో మీటింగులు పెట్టి, దిశానిర్దేశం చేస్తున్నారు. తాజాగా జగన్..విశాఖ నార్త్ నియోజకవర్గం నేతలతో సమావేశమయ్యారు. 175కి 175 సీట్లు గెలిచి తీరాలని,మరో 30 ఏళ్ళు […]

బాబు రాకతో కర్నూలులో సైకిల్ రాత మారేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించడానికి సిద్ధమయ్యారు. మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించి..అక్కడ పార్టీ పరిస్తితులని మెరుగు చేయాలని చూస్తున్నారు. వాస్తవానికి కర్నూలులో వైసీపీదే లీడింగ్. జిల్లాలోని 14 సీట్లు వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. అయితే నెక్స్ట్ ఎన్నికల్లో జిల్లాలో వైసీపీకి గట్టి పోటీ ఇవ్వాలని బాబు చూస్తున్నారు. ఈ సారి కనీసం 5  సీట్లు పైనే గెలుచుకోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా టూర్ పెట్టుకున్నారు..మొదట పత్తికొండలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ […]

బాబు జిల్లాలో ‘ఫ్యాన్స్’ పరుగులు..సీటు డౌటే!

వై నాట్ 175 నినాదంతో జగన్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. మనం ప్రజలకు మంచి చేస్తున్నాం కాబట్టి 175కి 175 సీట్లు గెలిచేస్తామని అంటున్నారు. 175  సీట్లు ఎందుకు గెలవకూడదని అని సొంత నాయకులని ప్రశ్నిస్తున్నారు. ఇలా టార్గెట్ గా పెట్టుకున్న జగన్..ఎమ్మెల్యేలని పరుగులు తీయిస్తున్నారు. గడప గడపకు వెళ్ళాల్సిందే అని ప్రతిసారి క్లాస్ పీకుతున్నారు. ఇప్పటికే పలుమార్లు వర్క్ షాప్ పెట్టి గడపగడపకు వెళ్లనివారికి క్లాస్ ఇచ్చారు. అలాగే సీటు కూడా ఇవ్వనని చెప్పేస్తున్నారు. దీంతో […]