టీడీపీలోకి కన్నా..జనసేనలో అదే అడ్డంకి..సీటుపై క్లారిటీ!

ఎట్టకేలకు సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 23న ఆయన టి‌డి‌పిలో చేరతారని తెలిసింది. అయితే దశాబ్దాల పాటు ఆయన కాంగ్రెస్ లో పనిచేశారు. అయిదుసార్లు పెదకూరపాడు ఎమ్మెల్యేగా, ఒకసారి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ లో మంత్రిగా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ దెబ్బతినడంతో ఆయన వైసీపీలోకి వెళ్లాలని చూశారు. కానీ బి‌జే‌పి పెద్దలు కన్నాని వైసీపీలోకి వెళ్లనివ్వకుండా బి‌జే‌పిలోకి లాగారు. అలాగే […]

జగన్‌ని వదలని బీజేపీ..వైసీపీ వివాదాస్పదం!

మహాశివరాత్రి సందర్భంగా వైసీపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వివాదాస్పదమైంది. బాలశివుడుకు జగన్ పాలు తాగిస్తున్న ఫోటోపై పెద్ద రచ్చ జరుగుతుంది. శివరాత్రి సందర్భంగా వైసీపీ అధికార సోషల్ మీడియాలో ఆ పోస్టు పెట్టారు. “  అన్నార్తుల ఆకలి తీర్చడమే ఈశ్వరారాధాన.” “ఆ శివయ్య చల్లని దీవెనలు రాష్ట్ర ప్రజలందరి పై ఉండాలని కోరుకుంటూ…శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.” అంటూ పోస్టు పెట్టారు. అయితే అలా జగన్ పాలు తాగిస్తున్నట్లు ఫోటో పెట్టడంపై ఏపీ […]

బాబు-సాయిరెడ్డి మంతనాలపై కొత్త చర్చ.!

టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి..ఇద్దరు నేతలు రాజకీయంగా బద్ధశత్రువులు. అసలు విజయసాయి ఏ స్థాయిలో చంద్రబాబు, లోకేష్ లపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తారో తెలిసిందే. దారుణమైన పదజాలం వాడుతూ తిడతారు. అంటే ఏ స్థాయిలో రాజకీయ శతృత్వం ఉందో చెప్పాల్సిన పని లేదు. రాజకీయంగా శతృత్వం ఉన్నా..ఫ్యామిలీ పరంగా బంధుత్వం ఉంది. విజసాయిరెడ్డి..నందమూరి తారకరత్న వాళ్ళ వైఫ్‌కు బాబాయి అవుతారు. అంటే తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి తల్లి, విజయసాయి భార్య […]

వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్..జంపింగ్ అప్పుడేనా?

అధికార వైసీపీకి మరో ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నారా? సొంత పార్టీపైనే మరో ఎమ్మెల్యేకు అసంతృప్తి ఉందా? నెక్స్ట్ సీటు దక్కదని తెలియడంతోనే ఆ ఎమ్మెల్యే పార్టీకి దూరం జరుగుతున్నారా? అంటే దర్శిలో జరుగుతున్న పరిణామాలని బట్టి చూస్తే అవుననే అనిపిస్తుంది. దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ గత కొంతకాలంగా వైసీపీలో యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించట్లేదు. ఏదో మొక్కుబడిగానే కార్యక్రమాలు చేయడం తప్ప..గడపగడపకు తిరగడం లేదని తెలిసింది. నెక్స్ట్ ఎన్నికల్లో సీటుపై గ్యారెంటీ లేకపోవడంతోనే మద్దిశెట్టి వైసీపీకి […]

కోటంరెడ్డి తమ్ముడికి వైసీపీ గాలం..రివర్స్ షాక్?

ఎప్పుడైతే వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూరమయ్యారో అప్పటినుంచి..కోటంరెడ్డి టార్గెట్ గా వైసీపీ రాజకీయం మొదలైంది..ఆయన్ని అడుగడుగున ఇరుకున పెట్టడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. ఇదే క్రమంలో ఇటీవల కోటంరెడ్డి అనుచరులని అరెస్ట్ చేసినట్లు తెలిసింది. గత ఐదు నెలల కిందట టీడీపీ నేతపై దాడి చేశారనే అభియోగం ఉన్న నేపథ్యంలో తాజాగా పోలీసులు కోటంరెడ్డి అనుచరులని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అయితే తన అనుచరుడు కోసం కోటంరెడ్డి పోరాటం మొదలుపెట్టారు.  మాజీ కార్పొరేటర్‌ తాటి […]

తారకరత్న కోరిక అదే..నెరవేరకుండానే.!

23 రోజుల పాటు మృత్యువుతో పొరాడి…చివరికి శనివారం రాత్రి నందమూరి తారకరత్న తుదిశ్వాస విడిచారు. గత నెలలో నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే. ఆ వెంటనే కార్యకర్తలు..కుప్పంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఇంకా మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ విదేశీ వైద్యులని సైతం రప్పించి తారకరత్నకు చికిత్స అందిస్తూ వచ్చారు. కానీ, అందరినీ విషాదంలో ముంచుతూ తారకరత్న తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. 23రోజుల పాటు […]

జగన్ కొత్త ట్విస్ట్..మంత్రివర్గంలో మార్పులు.!

ఏపీ మంత్రివర్గంలో ట్విస్ట్ ఉంటుందా…మరోసారి జగన్ మంత్రివర్గంలో మార్పులు చేస్తారా? అంటే ఇటీవల మంత్రివర్గం మార్పులపై చర్చ నడుస్తున్న సందర్భంలో చిన్న మార్పు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే వాస్తవ రూపం దాలుస్తుందా లేదా? అనేది క్లారిటీ లేదు. ఇప్పటికే జగన్ రెండుసార్లు మంత్రివర్గంలో మార్పులు చేశారు. మొదటే 25 మందితో ఒకేసారి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మధ్యలో మండలి రద్దు అని చెప్పి ఎమ్మెల్సీలుగా ఉన్న పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలని మంత్రివర్గం నుంచి […]

పెద్దాపురంలో టీడీపీలో అసంతృప్తి సెగలు..రాజప్పకు యాంటీ!

తెలుగుదేశం పార్టీకి కంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లో పెద్దాపురం కూడా ఒకటి. ఇక్కడ టి‌డి‌పి ఆరుసార్లు గెలిచింది. గత రెండు ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి నుంచి చినరాజప్ప గెలుస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇక మూడోసారి కూడా ఆయన పోటీకి రెడీ అవుతున్నారు. అయితే పెద్దాపురంలో పార్టీ పరంగా టి‌డి‌పి బలంగానే ఉంది..కానీ రాజప్పకు సొంత పార్టీలోనే వ్యతిరేకత కనిపిస్తుంది. ఈ సారి ఆయనకు సీటు ఇవ్వవద్దని వేరే వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. మొదట నుంచి పెద్దాపురం సీటు కమ్మ […]

గుడివాడ-గన్నవరంల్లో బాబు-చినబాబు పోటీ..వంశీ సవాల్!

తెలుగుదేశం పార్టీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి అదే పార్టీ నుంచి రెండుసార్లు గెలిచి..ఆ తర్వాత వైసీపీలోకి జంప్ చేసి..తమదైన శైలిలో చంద్రబాబు-లోకేష్‌లని కొడాలి నాని, వల్లభనేని వంశీ ఏ స్థాయిలో తిడుతున్నారో చెప్పాల్సిన పని లేదు. ఇలా తిడుతున్న ఈ ఇద్దరి నేతలకు చెక్ పెట్టాలని టి‌డి‌పి చూస్తుంది. కానీ అనుకున్న విధంగా వారి స్థానాల్లో టి‌డి‌పి బలపడటం లేదు. అందుకే దమ్ముంటే గుడివాడ, గన్నవరంల్లో చంద్రబాబు-లోకేష్ పోటీ చేయొచ్చుగా అని వంశీ సవాల్ చేశారు. తనను, […]