సినీ ఇండస్ట్రీలో మొదట స్టార్ హీరోతో సినిమా అనుకుని.. తర్వాత హీరో కథను యాక్సెప్ట్ చేయకపోవడం.. లేదా వేరే కారణాలతో ఆ హీరో తప్పుకోవడంతో.. మరో హీరో ఈ కథలో నటించి సక్సెస్ అందుకునే సందర్భాలు చాలానే ఉంటాయి. అలా తెలుగు సినీ ఇండస్ట్రీలోను.. మొదటి అనుకొన్న హీరో కాకుండా మరో హీరోతో డైరెక్టర్ సినిమాను తీసి సక్సెస్ అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అలా.. రాజమౌళి కెరీర్‌లోను ఓ సినిమా రూపొందింది. ప్రస్తుతం రాజమౌళి పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఈమెజ్తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి క్రమంలోనే గతంలో రాజమౌళి నటించాలని ఒక కథను డిజైన్ చేయగా ఓ హిరో ఆ కథను రిజక్ట్ చేశాడట. ఇంతకీ ఆ మూవీ ఏంటో.. అసలు ఆ కథను రిజెక్ట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరో.. ఒకసారి తెలుసుకుందాం.
ఆ సార్ హీరో మరి ఎవరో కాదు.. ప్రభాస్. రాజమౌళి మొట్టమొదటి సినిమా స్టూడెంట్ నెంబర్ 1. ఈ సినిమా ముందుగా ప్రభాస్‌తో చేయాలని రాజమౌళి భావించాడట. ప్రభాస్‌కు కథ కూడా వినిపించగా.. ఆయన నో చెప్పడంతో చేసేదేమీ లేక ఎన్టీఆర్ వద్దకు స్టోరీ తీసుకువెళ్లారు. ఈ సినిమా సూపర్ హిట్ అని తెలిసింది. తర్వాత వచ్చిన సింహాద్రి సినిమా టైంలో కూడా ప్రభాస్‌నే రాజమౌళి కథ వినడానికి పిలిచారట. అయితే.. ఈ కథ కూడా కొన్ని కారణాలవల్ల ఎన్టీఆర్ వద్దకి వెళ్లి సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అలా.. రాజమౌళి మొదటి రెండు హిట్ సినిమాలకు ప్రభాస్‌ని హీరోగా భావించాడట. అయితే.. రాజమౌళి సక్సెస్‌తో ప్రభాస్‌కి ఆయన కెపాసిటీ ఏంటో అర్థమైంది. అప్పుడే మా ఇద్దరి కాంబినేషన్‌లో అసలు సినిమా ఉంటుందా అని ప్రభాస్ అనుకున్నాడట.
అయితే.. సింహాద్రి సినిమా ప్రభాస్ తర్వాత బాలకృష్ణతో తీయాలని రాజమౌళి భావించాడు. కానీ.. కథ విన్న బాలకృష్ణ ఈ స్టోరీ నాకంటే మా తారక్‌కు బాగా సెట్ అవుతుంది ఆయనతో సినిమా తీయమని చెప్పాడట. చేసేదేమీ లేక ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు రాజమౌళి. ఈ క్రమంలోనే వరుస సక్సెస్‌లు అందుకున్న రాజమౌళిని చూసి ప్రభాస్.. ఇకపై నాతో సినిమా చేస్తాడా ఏంటి అనుకున్నాడట. కానీ.. రాజమౌళి నీతో కచ్చితంగా ఓ సినిమా చేస్తానని ఓ సందర్భంలో మాటిచ్చాడట. ఆ మాట ప్రకారం రాజమౌళి ఛత్రపతి సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు.. ఈ సినిమా తర్వాత.. ప్రభాస్ రేంజ్ మరో లెవెల్ కు వెళ్ళింది అనడంలో అతిశయోక్తి లేదు. అలా.. ఇద్దరు కాంబినేషన్‌లో బాహుబలి, బాహుబలి 2 సినిమాలు కూడా వచ్చి ప్రపంచ లెవెల్లో తెలుగు సినిమా ఖ్యాతిని చాటి చెప్పాయి. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ప్రభాస్ పాన్ ఇండియన్ రెబల్ స్టార్ గా చేతినిండా సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు.