మన శంకర వరప్రసాద్ గారు: మెగా, విక్టరీ మాస్ సాంగ్ పై అదుర్స్ అప్డేట్..

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ క్రేజీ ఫ్యామిలీ కామెడీ సినిమాలో విక్టరీ వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక.. ఈ ఇద్దరు స్టార్ హీరోల కాంబోలో వస్తున్న సినిమా కావడం.. అనిల్ రావిపూడి దర్శకుడుగా వ్యవహరించడంతో ప్రాజెక్ట్‌పై మొద‌టి నుంచే మంచి హైప్ మొద‌లైంది. ఇక ఈ సినిమాల్లో మెగా, విక్టరీ కాంబో సాంగ్ కు సంబంధించిన మెసీవ్‌ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఎట్టకేల ఈ సాంగ్‌ అప్డేట్‌ను రిలీజ్ చేశారు. మూవీలో థర్డ్ సింగిల్ మెగా, విక్టరీ మాస్ సాంగ్ డిసెంబర్ 30న రిలీజ్ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

Mega Melody - #Meesaalapilla ☑️ Mega Grace - #SasiRekha ☑️ And Now Mega - Victory  Mass Track from Boss Of Masses #MegaStar @chiranjeevikonidela garu's most  awaited film #ManaShankaraVaraPrasadGaru Loading...! ♥️🔥 @sushmitakonidela  #MSGonJAN12th #

దానికి సంబంధించిన ప్రోమో మరికొద్ది గంటల్లో రిలీజ్ చేయనున్నారు. సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఫులాఫ్ ఎనర్జీతో.. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ ఇద్దరు స్టైలిష్ డ్యాన్స్ ఫోజులు ఆకట్టుకుంటున్నాయి. బ్యాగ్రౌండ్ లో డ్యాన్సర్‌ల‌తో కలిసి ఫుల్ సెలబ్రేషన్ వైబ్‌ను ఎంజాయ్ చేస్తున్నట్లు పోస్టర్‌లో క‌నిపించింది. డైనమిక్ లుక్ సన్ గ్లాసెస్‌తో చిరంజీవి మెరవగా రెడ్ జాకెట్‌లో స్టాండింగ్ లుక్‌తో వెంకటేష్ ఫిదా చేసాడు.

🎉🔥 #Megavibes incoming! The Biggest Celebration Anthem is ...

ఇద్దరు మాస్ ఆపిల్, స్వాగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. అంతే కాదు.. ఈ ఇద్దరు సూపర్ స్టార్ల కాంబోలో వస్తున్న సాంగ్.. బిగ్గెస్ట్ సెలబ్రేషన్ ఆంథంగా మ్యూజిక్ చార్ట్‌ను షేక్‌ చేయబోతుందని అంటున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా స్టార్ట్ చేయడానికి ఇది పర్ఫెక్ట్ పాట అవ్వబోతుందట. షైన్ స్క్రీన్‌, గోల్డ్ బాక్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాల్లో నయనతార హీరోయిన్‌గా మెర‌వ‌నున్న‌ సంగతి తెలిసిందే. సంక్రాంతి బరిలో జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధం చేస్తున్నా ఈ సినిమాతో.. అనిల్‌ మళ్లీ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా.. లేదా.. చిరుకి ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో చూడాలి.