శంబాల హిట్ క్రేజ్.. బ్లాక్ బస్టర్ బ్యానర్లు ఆది కొత్త మూవీ..!

ప్రేమకావాలి సినిమాతో వెండితెరకు పరిచయమైనా అది సాయికుమార్.. ఈ మూవీ తర్వాత ఒక సరైన హిట్ కూడా అందుకోలేకపోయాడు. దాదాపు 14 ఎళ్లుగా.. ఓ సరైన హిట్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేసినా.. ఒక్కటి కూడా వర్కౌట్‌ కాలేదు. అలాంటి టైంలో రీసెంట్గా రిలీజ్ అయిన శంబాల హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచే భారీ అంచనాలను నెలకొల్పిన టీం.. రిలీజ్ తర్వాత కూడా ఆంచనాలను అందుకుని.. పాజిటివ్ రివ్యూస్ దక్కించుకుంటున్నారు. సూపర్ నేచురల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ సినిమా.. ఆడియన్స్‌ను మెప్పించింది.

Rajesh Danda to produce Aadi Saikumar's next film

అద్భుతమైన కథ, ఊహించిన ట్విస్టులు, ఉత్కంఠభ‌రిత సస్పెన్స్‌ల‌తో ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యింది. ఈ క్రమంలోనే.. శంబాల హిట్ క్రేజ్.. ఆది కెరీర్‌లో మైల్డ్‌ స్టోన్‌గా మారింది అనడంలో అతి శ‌యోక్తి లేదు. ఇప్పటికే ఈ సినిమా క్రేజ్‌తో అది సాయి కుమార్‌కు ప్రాజెక్టులు క్యూ కడుతున్నాయని.. ఈ క్రమంలోనే బ్లాక్ బ‌స్టర్ బ్యానర్‌కు సైన్ చేసాడంటూ టాక్ నడుస్తుంది. ఇంతకీ ఆ బ్లాక్ బ‌స్టర్ బ్యాన‌ర్ ఏదోకాదు హాస్య మూవీస్. రాజేష్ దండా ఇటీవల కాలంలో ఈ బ్యానర్ పై మంచి కంటెంట్లతో సినిమాలు తీస్తూ వారుస హిట్లు అందుకుంటున్నాడు. సామజ వరగమన, ఇట్లు మారేడుమల్లి ప్రజానీకం, బచ్చలమ‌ల్లి, ఊరు పేరు భైరవకోన.. తాజాగా కె ర్యాంప్‌ ఈ సినిమాలన్నీ ఆడియన్స్‌లో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నాయి.

Aadi and Sai Kumar Emotional Moment ❤ | Aadi Saikumar Speech @ Shambhala  Movie Success Meet

ఈ క్రమంలోనే.. హాస్య బ్యానర్స్ లో నెక్స్ట్ ప్రాజెక్ట్ అది సాయికుమార్‌తోనే ఉంటుందని రాజేష్ దండా వివరించాడు. తాజాగా శంబాల సక్సెస్ మీట్‌లో సందడి చేసిన ఆయన మాట్లాడుతూ.. ఆది సాయికుమార్‌తో సినిమా చేయనున్నట్లు వెల్లడించాడు. తన గత సినిమాల లాగానే.. ఈ సినిమా కూడా ఎంటర్టైన‌ర్ కాన్సెప్ట్‌తో రానుందని.. దానికి సంబంధించి డైరెక్టర్, మిగతా కాస్టింగ్ వివరాలు త్వరలోనే అఫీషియల్ గా ప్రకటిస్తామంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఆది సాయికుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆడియన్స్‌లో బజ్‌ క్రియేట్ అయింది. ఇప్పటికే శంబాల స‌క్స‌స్ జోష్‌తో ఉన్న ఆదికి.. తన నెక్స్ట్ సినిమాతో కూడా హిట్ పడితే.. మళ్లీ ట్రాక్ లో పడిపోతాడు అనడంలో సందేహం లేదు.