ఊహించని వివాదంలో రాజాసాబ్.. కారణం అతనేనా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రెటీలుగా ఓ ఇమేజ్‌ క్రియేట్ అయిన తర్వాత.. వాళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క విషయంపై శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో స్టేజిపై యథాలపంగా మాట్లాడే కొన్ని మాటలు కూడా పెద్ద దుమారాలకే దారి తీస్తాయి. సెలబ్రిటీ.. ఆ మాటలు మాట్లాడే సమయంలో వాటి తీవ్రత వాళ్లకు తెలియకపోవచ్చు.. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం వాటిని హైలెట్ చేస్తూ జనాని ఏకిపారేస్తారు. కొన్ని గంటల్లోనే అది పెద్ద వివాదంగా మారిపోతుంది. ఇటీవల.. నటుడు శివాజీ హీరోయిన్ వస్త్రధారణ గురించి చేసిన కామెంట్స్ కూడా అలాగే భారీ వివాదానికి దారితీసాయి. ఇప్పటికి ఆ వివాదం సర్దుమణ‌గ‌లేద‌ని చెప్పాలి.

Maruthi gets emotional at The Raja Saab pre-release event | FridayWall

అయితే.. తాజాగా రాజాసాబ్‌ కూడా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుందని.. దానికి కారణం డైరెక్టర్ మారుతి చేసిన కామెంట్స్. ప్రస్తుతం మారుతి కామెంట్స్ తో సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్‌ మొదలైంది. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ కామెంట్స్‌పై ఫైర్ అవుతున్నారు. ఇక రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే ప్రభాస్ గురించి చాలా గొప్పగా వివరించాడు. తనకు ఇవ్వాల్సిన ఎలివేషన్స్ ఇస్తూ సినిమా విషయంలో కూడా చాలా ధీమాగా మాట్లాడి.. ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపాడు. అయితే స్పీచ్ మధ్యలో.. అనుకోకుండా ప్రభాస్ ఒకప్పటి ఇమేజ్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వివాదానికి దారి తీసాయి. మీడియం రేంజ్‌ హీరోగా ఉన్న ప్రభాస్‌ను రాజమౌళి ఇండియన్ సూపర్ స్టార్ గా మార్చడని.. అందుకే ఇప్పుడు.. దర్శకులు అంతా ఆయనకు రుణపడి ఉంటారంటూ చెప్పుకొచ్చాడు.

ఇందులో తప్పుడు ఉద్దేశం లేకపోయినా.. ఒకప్పుడు ప్రభాస్ మీడియం రేంజ్ హీరో అని చెప్పడం.. రెబల్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చలేదు. ఫ్యాన్స్ సైలెంట్ గా ఉన్నా.. యాంటీ ఫ్యాన్స్ ఆ మాటలను ట్రోల్స్ చేస్తూ.. బాహుబలి లేకపోతే ప్రభాస్ స్టారే అయ్యేవాడు కాదంటూ.. ఈ సినిమాతో లాటరీ కొట్టాడంటూ రకరకాలుగా నెగిటివ్ కామెంట్స్‌ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మారుతి అనవసరంగా గతాన్ని గురించి మాట్లాడాడని మండిపడుతున్నారు. అంతేకాదు.. రాజమౌళి బాహుబలి సినిమాలో మ‌రో హీరోతో చేసిన ఈ రేంజ్‌లో ఇమేజ్ కచ్చితంగా రాదని.. ఇలాంటి సక్సెస్ అందుకోలేరని.. కనుక బాహుబలి సక్సెస్ లో క్రెడిట్ ప్రభాస్ ది అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.