టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరస పాన్ ఇండియన్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఇందులో అత్యంత ఆసక్తిని కల్పిస్తున్న మూవీ స్పిరిట్. సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా రూపొందిస్తున్న.. ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే ఆకాశాని కంటాయి. తాజాగా.. సినిమాకు సంబంధించిన ప్రభాస్ ఫోటోషూట్ కంప్లీట్ అయినట్టు సినీ వర్గాలు చెప్తున్నాయి.
ఈ క్రమంలోనే సినిమాకు సంబంధించిన ఓ గూస్ బంప్స్ అప్డేట్ న్యూ ఇయర్ కానుకగా రివీల్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారట. అదేంటంటే.. సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ ఫ్యాన్స్‌తో పంచుకోనున్నారని సమాచారం. ఈ సినిమాలో.. ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. ఇక ఆ లుక్‌లో ప్రభాస్ ఎలా ఉండబోతున్నాడని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఇప్పటివరకు ప్రభాస్ కెరీర్‌లో ఒక్కసారి కూడా పోలీస్ పాత్రలో కనిపించిందే లేదు. ఈ క్రమంలోనే.. ఆయన ఫస్ట్ లుక్‌పై ఆడియన్స్ లో మంచి హైప్‌ను క్రియేట్ చేస్తుంది.
ఇక మరోపక్క.. ప్రభాస్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ గురించి సోషల్ మీడియాలో చర్చలు భారీగా కొనసాగుతున్నాయి. మారుతి డైరెక్షన్లో ఈ సినిమా నుంచి ఆదివారం సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారట. కొన్ని సాంకేతిక కారణాల వల్ల.. అది వాయిదా పడిందని ప్రభాస్ అభిమానులు నిరాశ వ్యక్తం చేసినా. న్యూ ఇయర్‌కు మాత్రం కచ్చితంగా రాజాసాబ్ సర్ప్రైజ్ ఇవ్వబోతుంది అంటూ తెలుస్తుంది. ఈ క్రమంలోనే.. ప్రభాస్ ఫ్యాన్స్‌కి ఒకేసారి డబల్ సర్ప్రైజ్.. ఫస్ట్ లుక్ తో పాటు రాజాసాబ్ నుంచి ఎంటర్టైన్మెంట్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ అభిమానులు ఈ క్రేజీ అప్డేట్ల కోసం ఎదురుచూస్తున్నారు.



