నందమూరి ఫ్యాన్స్ కు బిగ్ గుడ్ న్యూస్.. బాలయ్య ఖాతాలో అదుర్స్ రికార్డ్..!

టాలీవుడ్ నందమూరి నట‌సింహం బాల‌య్య ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా ఐదు సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టిన ఆయన.. తాజాగా అఖండ 2తో ఆడియ‌న్స్‌ను పలకరించింది. బోయపాటి శీను డైరెక్షన్‌లో అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బ‌స్టర్ సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా పై ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే సినిమాకు భారీ లెవెల్‌లో బిజినెస్ జరిగింది. దానికి తగ్గట్లుగానే ఓపెనింగ్స్ లోను మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. అయితే.. ఇటీవ‌ల అఖండ 2తో బాలయ్య.. అమెరికా బాక్సాఫీస్ దగ్గర ఫ్యూజ్‌లు ఎగిరిపోయే క్రేజి రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు.

ముఖ్యంగా.. నార్త్ అమెరికాలో బాలయ్య నటించిన సినిమాలు వరుసగా మంచి వసూళ్లు దక్కించుకోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అఖండ సినిమాతో మొదలుకొని వీర సింహారెడ్డి, భగవంత్‌ కేసరి, డాకు మహారాజా, అఖండ 2 తాండవం.. ఇలా అన్ని సినిమాలు వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేయడం విశేషం. ఒక సీనియర్ స్టార్ హీరో సినిమాకు.. అది కూడా నార్త్ లో వరుసగా 5 సార్లు మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరడం అంటే సాధారణ విషయం కాదు. బాలయ్య కెరీర్‌లోనే ఇది ఒక రేర్ అచీవ్మెంట్ అంటూ సినీ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అంతేకాదు.. ఈ 5 సినిమాలతో పాటు.. గతంలో ఆయన నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సైతం నార్త్ అమెరికాలో వన్ మిలియన్ డాలర్ల మార్క్‌ను క్రాస్ చేసింది. ఈ సినిమాతో కలిపితే మొత్తం 6 సినిమాలు.. నార్త్‌లో వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను టచ్ చేశాయి. ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా టాలీవుడ్ లో బాలయ్య రేర్ రికార్డ్‌ ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ఈ న్యూస్ నందమూరి ఫ్యాన్స్ కు ఆనందాన్ని కలిగిస్తుంది. బాలయ్య బ్రాండ్ అది అంటూ.. ఆయన కెరీర్‌లో మరిన్ని సక్సెస్ లు అందుకోవాలంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.