ఆ ఇద్దరి చేతిలోకి రోషన్ కెరీర్.. ఇకపై ఫేట్ మారుతుందా..!

సినీ ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్‌కు అవకాశాలు దక్కించుకోవడం కాస్త సులభతరం అవుతుందేమో.. కానీ టాలెంట్ ఉంటేనే ఎలాంటి వాళ్లకైనా కెరీర్ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇప్పటికి ఎంతమంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించలేక గుడ్ బై చెప్పేస్తున్నారు. అయితే.. తాజాగా టాలీవుడ్‌లో సీనియర్ స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు.. రోషన్ మేక ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన టాలెంట్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాడు. తాజాగా.. ఆయన నుంచి వచ్చిన ఛాంపియన్ సినిమా మంచి సక్సెస్ అందుకుంటుంది. ఈ క్ర‌బంలోనే ఇప్పుడు రోషన్కు ఓ గోల్డెన్ అవకాశం అందుకున్నాడు. యువ హీరోల కెరీర్ను యు టర్న్ తిప్పే రెండు భారీ నిర్మాణ సంస్థలు రోషన్ పై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తుంది. వాటిలో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్ కాగా.. మరొకటి గీత ఆర్ట్స్.

ఇక ప్ర‌జెంట్ రోషన్ లుక్స్, ఆయన యాక్టింగ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఇక నాగ వంశీ.. సితార బ్యానర్ పై తీసే ప్రతి ఒక్క సినిమాతో చాలా వైవిధ్యతను చూపిస్తూ ఉంటాడు. రొటీన్ కు భిన్నంగా ఆలోచన చేస్తాడు. అలాంటి బ్యానర్‌లో రోషన్‌తో సినిమా చేస్తున్నాడు అంటే ఏ రేంజ్‌లో ప్లానింగ్ ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. సాధారణంగా సీతారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కంటెంట్‌పై యూత్‌లో మొదటి నుంచే మంచి నమ్మకం ఉంటుంది. ఈ క్రమంలోనే.. రోషన్ విషయంలో నాగ వంశీ జడ్జిమెంట్ వ‌ర్కౌట్ అయితే మాత్రం ఆయన ఫేట్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు. మ‌రోప‌క్క గీత ఆర్ట్స్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా రోషన్‌లో ఆ స్పార్క్ ను గమనించి గీత ఆర్ట్స్పై సినిమాను అనౌన్స్ చేశాడు.

Champion Teaser: Roshan Meka Leaves a Strong Impact in the Upcoming Film  from Vyjayanthi Movies | Zoom TV

ఇప్పటికే గ్లోబల్ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకునే కెపాసిటీ రోషన్‌ఖు ఉందని ప్రశంసలు వస్తున్నాయి. ఇలాంటి న‌టుడు.. అరవింద్ లాంటి ప్రొడ్యూసర్ చేతుల్లో పడితే మార్కెట్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంటుంది. ఇప్పుడు రోషన్ లాంటి వాళ్లకు కావలసింది కూడా అలాంటి బ్యానర్లే. ఈ క్రమంలోనే రెండు బ్యానర్లపై తాను నటించే సినిమాలు హిట్ అయితే.. రోషన్ కచ్చితంగా స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోతాడు అనడంలో సందేహం లేదు. కేవలం లుక్స్‌ కాదు.. బాక్స్ ఆఫీస్‌ను కల్లగొట్టే సత్తా కూడా ఉన్నట్టుగా.. రోషన్ నిరూపించుకోవడానికి 2026 సరైన టైం. మరి తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటాడో.. లేదో.. ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంటాడో చూడాలి.