” స్పిరిట్ ” లో విలన్ గా తెలుగు స్టార్ హీరో.. సందీప్ వంగా క్లారిటీ..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్గా సందీప్ రెడ్డివంగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తను తెరకెక్కించిన‌ ఫస్ట్ మూవీ అర్జున్ రెడ్డి తోనే ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్గా మారిపోయిన సందీప్.. తర్వాత కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విలన్ గా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోను తీసుకున్నారని వార్తలు తెగ వైరల్ గా మారాయి. ఇక అతను ఎవరనే విషయాన్ని మాత్రమే రివిల్ చేయలేదు.

Bhimaa: Everything You Need To Know about Gopichand's Upcoming Movie

అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో విల‌న్‌గా గోపీచంద్ పరిచయం చేయబోతున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్‌.. గోపీచంద్‌కు మధ్యన మంచి బాండ్ ఉంది. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అన్న సంగతి ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. వర్షం సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా.. గోపీచంద్ విల‌న్ పాత్రలో మెరిశారు. అప్పటినుంచి.. వెళ్ల స్నేహం మొదలైంది. అది కాస్త స్ట్రాంగ్ బంధంగా మారిపోయింది. ఈ క్రమంలోనే ప్రభాస్ సినిమాల్లో మంచి రోల్‌ పడితే మాత్రం కచ్చితంగా చేస్తానని గోపీచంద్ ఎన్నో సందర్భాల్లో వివరించాడు.

Gopichand With Sandeep Reddy Vanga

ఇతర హీరోల సినిమాల్లో విలన్ గా చేయడానికి చాలా వరకు ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ.. ప్రభాస్‌తో సినిమా అంటే అది ఏ పాత్ర అయినా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది అని గోపీచంద్ ఒక టైం లో వివరించాడు. అందులో భాగంగానే పవర్ఫుల్ విలన్ పాత్రను సందీప్ రెడ్డివంగా గోపీచంద్ కోసం డిజైన్ చేశాడట. ఈ విషయాన్ని గోపీచంద్ కు చెప్పగానే తాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. రీసెంట్గా సందీప్ వంగా ఆఫీసుకు గోపీచంద్ వెళ్లి.. అక్కడ వాల్ పై ఉన్న చిరంజీవి ఫోటోతోను అలాగే సందిప్ రెడ్డి వంగతోను ఫోటో దిగాడు. సోషల్ మీడియాలో షేర్ చేయగా అవి విపరీతంగా వైరల్ గా మారుతున్నాయి. ఈ క్రమంలోనే స్సిరిట్‌ విలన్‌గా గోపీచంద్ నటిస్తున్నాడనే దానిపై సందీప్ త్వరలోనే అఫీషియల్ క్లారిటీ ఇవ్వనున్నాడట.