నేషనల్ క్రష్‌గా రేష్మిక మందన పాన్ ఇండియా లెవెల్‌లో ఎలాంటి ఇమేజ్ క్రియేట్ చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఛల్లో సినిమాతో టాలీవుడ్‌లో కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు.. ఇప్పుడు భాషలతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుని దూసుకుపోతుంది. తక్కువకాలంలోనే దాదాపు అందరూ స్టార్ హీరోల సరసన నటించిన ఈ అమ్మడు.. సినిమా సినిమాకు క్రేజ్ ను అంతకంతకు పెంచుకుంటూ పోతుంది. ప్రస్తుతం రష్మిక కెరీర్.. ఫుల్ జోష్‌లో ఉంది. పుష్ప సాలిడ్ సక్సెస్ తర్వాత అమ్మడి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోయింది.
కేవలం తెలుగులోనే కాదు.. తమిళ్, హిందీ భాషల్లోను అవకాశాలు కొట్టేస్తుంది. ఇక పుష్ప సినిమా తర్వాత యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు వరుసగా హిట్లు గా నిలిచాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వర్షం కురిపించాయి. దెబ్బతో రష్మిక సౌత్ లక్కి హీరోయిన్గా మారిపోయింది. ఇక.. ఈ అమ్మడు రీసెంట్ గా చేసిన గర్ల్ ఫ్రెండ్ మూవీతో మరోసారి సక్సెస్ ఖాతాలో వేసుకుంది. ఇక 2024 నుంచి 2025 వరకు వరుస సక్సెస్‌లు అందుకున్న ఈ ముద్దుగుమ్మ వచ్చే ఏడది మరిన్ని ప్రాజెక్టులతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతుంది.
అయితే ఈ ప్రాజెక్టుల కోసం.. రెమ్యూనరేషన్ కూడా భారీగానే ఛార్జ్ చేస్తుందట. 2026లో తను నటించిన సినిమాల కోసం రష్మిక భారీగా డిమాండ్ చేసినట్లు టాక్. వరుస హిట్లతో మంచి జోష్‌లో ఉన్న ఈ అమ్మడు.. ఒక్కసారిగా రెమ్యూనరేషన్‌ను రూ.10 కోట్లు పెంచేసిందని సమాచారం. అయితే.. నిర్మాతలు సైతం ఆమె అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని.. రష్మిక తమ సినిమాలో కనిపించినా చాలు.. నేషనల్ లెవెల్ లో సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కుతుందని మేకర్స్.. సినిమాల్లో తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారట. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న రష్మిక – విజయ్ దేవరకొండను వివాహం చేసుకోనిదని.. పెళ్లి తర్వాత కూడా యాక్టింగ్ కంటిన్యూ చేస్తుందని టాక్.



