సంక్రాంతి సినిమాల్లో అందరికన్నా వెనుకపడ్డ రవితేజ.. కారణం ఏంటంటే..?

సంక్రాంతి పండుగ టాలీవుడ్ సినిమాల రిలీజ్ కు మంచి సీజన్ అని చెప్పాలి. చిన్న సినిమాలు నుంచి పెద్ద సినిమాలు వరకు.. చిన్న చిన్న హీరోల నుంచి స్టార్ హీరోలు, దర్శకుల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాలను సంక్రాంతి బరిలో రిలీజ్ చేయాలని ఆరాటపడుతూంటారు. అలాగే.. ఈసారి కూడా సంక్రాంతి బరిలో చాలా సినిమాలు రిలీజ్ కానున్నాయి. కాగా.. మొదట రెబల్ స్టార్ ప్రభాస్ – మారుతి కాంబోలో రాజాసాబ్‌ మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ చేస్తున్నారు.

Six Films In Line For Sankranthi 2026 | cinejosh.com

తర్వాత సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి రంగంలోకి దిగుతారు. మ‌న శంక‌ర వ‌ర‌ప్రసాద్ గారు సినిమాతో జనవరి 12న ప్రేక్షకులను పలకరించనున్నారు. ఈ సినిమా తర్వాత.. మాస్ మహారాజు రవితేజ – కిషోర్ తిరుమల కాంబోలో.. భర్త మహాశ‌యులకు విజ్ఞప్తి మూవీ రిలీజ్ కానుంది. ఈ మూవీ.. జనవరి 13న రిలీజ్ అవుతుంది. ఇక సెలవు తర్వాత జనవరి 14న శర్వానంద్ – నారి నారి నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి – అనగనగా ఒక రాజు రెండు సినిమాలు రిలీజ్ అవుతాయి.

Bhartha Mahashayulaku Wignyapthi Teaser Sparks Family Entertainment Buzz | cinejosh.com

ఈ ఐదు తెలుగు సినిమాలు.. ఈ ఏడాది సంక్రాంతి బరిలో సందడి చేస్తున్నాయి. అయితే.. వీటన్నింటితో పోలిస్తే మాస్ మహారాజు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీ మాత్రం ప్రమోషన్స్‌లో కాస్త డీలా ప‌డింద‌ని చెప్పాలి.. దానికి తగ్గట్టుగానే రవితేజ గత సినిమాలు ప్లాపులుగా నిలవడంతో.. ఈ క్ర‌మంలోనే మిగ‌తా 4 సినిమాల‌తో పోలిస్తే సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ చాలా తక్కువగా జరిగాంద‌ని స‌మాచారం.