చిన్న సినిమాలతో ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా.. సంక్రాంతి మ్యాజిక్ రిపీట్ అవుతుందా..!

సంక్రాంతి తెలుగు సినిమాల‌ పెద్ద పండగ. ఈ సీజన్‌లో బాక్స్ ఆఫీస్ దగ్గర తమ సినిమాలను రిలీజ్ చేసి సత్తా చాటుకోవాలని హీరల నుంచి డైరెక్టర్ల,ప్రొడ్యూసర్ ల వరకు.. చిన్న ,పెద్ద అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరు ఆరాటపడుతుంటారు. ఈ క్రమంలో ఈ ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న సినిమాల విషయములోను ఆడియన్స్ లో ఆసక్తి మొదలైంది. గత రెండేళ్లుగా టాలీవుడ్ సినిమాల ట్రెండ్ మారింది. స్టార్ హీరోల నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలకు గట్టి పోటీ ఇస్తూ.. తక్కువ బడ్జెట్‌తో తెర‌కెక్కిన చిన్న సినిమాలు అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంటున్నాయి.

Another mid-range Telugu film eying the Sankranti 2026 race?

ఉదాహరణకు.. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో నుంచి గుంటూరు కారం సినిమా వచ్చినా.. ఆ సినిమాకు కాంపిటీషన్ ఇస్తూ హనుమన్ సినిమా తెర‌కెక్కి.. అంతకు మించిపోయే రేంజ్‌లో కలెక్షన్లు కొల్లగొట్టింది. కేవలం తెలుగులోనే కాదు.. పాన్ ఇండియా లెవెల్‌లో ప్రభంజనం సృష్టించింది. అలాగే 2025 సంక్రాంతి సీజన్ లోనూ రామ్‌చరణ్, బాలకృష్ణ నుంచి వచ్చిన భారీ బడ్జెట్ సినిమాలను సైతం వెనక్కు నెట్టి అనిల్ రావిపూడి – వెంక‌టేష్‌.. సంక్రాంతికి వస్తున్నాం సినిమా మ్యాజిక్ ను క్రియేట్ చేసింది. భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే వచ్చే ఏడాది సంక్రాంతి బ‌రిలో రిలీజ్ కానున్న చిన్న సినిమాలు ఇదే మ్యాజిక్ రిపీట్ చేస్తాయా.. లేదా అని ఆసక్తి అందరిలోనూ మొదలైంది.

Sankranthi Going Extra Long Title Marathon Begins, Is This The Reason? | Sankranthi Going Extra Long Title Marathon Begins, Is This The Reason?

ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో అనగనగా ఒక రాజు, నారి నారి నడుమ మురారి, భక్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు సిద్ధమవుతున్నాయి. బడ్జెట్ పరంగా చిన్న సినిమాలు కాకపోయినా.. ప్రభాస్ – రాజా సాబ్, మెగాస్టార్ – శంకర వరప్రసాద్ గారు సినిమాలతో పోలిస్తే ఇవి చిన్న సినిమాలనే చెప్పాలి. అయితే ఈసారి స్టార్ హీరోలు సైతం తమ యాక్షన్ ఇమేజ్ తో పాటు.. ఫ్యామిలి కామెడీను జోడించి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక సినిమా బడ్జెట్ ఏదైనా.. హీరోలు క్రేజ్‌తో సంబంధం లేకుండా.. సంక్రాంతి బరిలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలు రిలీజ్ అయితే చాలు.. ఆ సినిమాల‌కు ఆడియోస్ బ్రహ్మ రథం పడతారు. ఇప్పటికే పలు సందర్భాల్లో ఇది ప్రూవ్ అయింది. మరి ఈ ఏడాది కూడా చిన్న సినిమాలు అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తాయా.. లేదా అసలు హిట్ సెంటిమెంట్ ఈసారి సంక్రాంతి సినిమాలకు వర్కౌట్ అవుతుందా లేదా.. చూడాలి.