రాజాసాబ్ రికార్డ్ లెవెల్ బిజినెస్.. ప్రభాస్ కు మాత్రమే సాధ్యం..!

పాన్ ఇండియా నెంబర్ 1 స్టార్ హీరోగా రెబల్ స్టార్ ప్రభాస్ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బాహుబలి 2 బాక్సాఫీస్ దగ్గర సంచలన సృష్టించిన రెబల్ స్టార్.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పారు. అప్పటినుంచి ఇప్పటివరకు.. వరుస భారీ ప్రాజెక్టులు నటిస్తూ ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ప్రభాస్.. ప్రస్తుతం హారర్‌ కామెడీ థ్రిల్లర్.. ది రాజాసాబ్‌తో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మారుతి డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ ఆడియన్స్‌లో మంచి అంచనాల‌ను నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. రికార్డు లెవెల్ బిజినెస్ జరుపుకుంటుంది.

అన్ని ఏరియాలోను సినిమా హక్కులు భారీ మొత్తానికే కొనుగోలు చేస్తున్నట్లు టాక్. ప్రభాస్ పాన్‌ ఇండియా లెవెల్‌లో ఉన్న క్రేజ్ దృష్టిలో పెట్టుకొని బయర్లు సినిమాపై భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారట. ఈ సినిమాతో ప్రభాస్.. మరోసారి తన గ్లోబల్ మార్కెట్ ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక సినిమా నుంచి కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన సెకండ్ ట్రైలర్ ప్రేక్షకులలో మ్చి రెస్పాన్స్ ద‌క్కించుకుంటుంది. ఇందులో ప్రభాస్ వింటేజ్ లుక్, ఆయన మేనరిజంకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

బాహుబలి తర్వాత వరుస యాక్షన్ సినిమాలతో రికార్డ్‌లు క్రియేట్ చేసిన డార్లింగ్.. రాజాసాబ్‌తో ఫ్యాన్స్‌కు మంచి థ్రిల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఈ క్రమంలోనే హారర్ కామెడీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాతో మరోసారి ప్రభాస్ బ్లాక్ పాస్టర్ కొట్టడం కాయ‌మ‌ని.. బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో రుజువు చేసుకుంటాడు అంటూ ఫ్యాన్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఇక హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీలో ప్రభాస్ ఎనర్జీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంద‌ట. ఇక ఇప్పటికే సినిమా సినిమాతో గ్లోబల్ లెవెల్‌లో ఇమేజ్ రెట్టింపు చేసుకుంటూ పోతున్నాడు. డార్లింగ్ కేవలం తెలుగులోనే కాదు.. ఓవర్సీస్‌లోను ఆయన సినిమాలకు భారీ హైప్ నెలకొంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.