మారుతి డైరెక్షన్‌లో ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాజాసాబ్.. సంక్రాంతి కానుకగా జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్‌గా.. నిధి అగర్వాల్, మాళవిక మోహన్, రిద్ది కపూర్ హీరోయిన్లుగా మెరవనున్నారు. మొదటిసారి ప్రభాస్ హారర్ కామెడీ చేస్తుండడంతో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక.. నిన్న సాయంత్రం ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ హైదరాబాద్‌లో గ్రాండ్ లెవెల్‌లో జరిగాయి. రాజాసాబ్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ.. సినిమాపై చేసిన కామెంట్స్ అంచనాలను అమాంతం పెంచేసాయి.

ఇక.. ఈ ఈవెంట్‌లో ప్రభాస్ మాట్లాడుతూ డార్లింగ్ మీకు నచ్చిందని ఈ పిలక కూడా వేసుకున్న.. జపాన్‌లో లవ్ సింబల్స్ అన్నీ ఇచ్చాను కదా.. ఇప్పుడు కూడా ఇస్తున్న.. చలి కదా ఇబ్బంది పడుతున్నారు కాస్త చూసుకోండి అంటూ కామెంట్స్ చేశాడు. ఇక సంజయ్ దత్త్ గారు సీను మొత్తం తినేస్తారని.. ఆయన స్క్రీన్ ప్రజెన్స్ చాలు.. ఇక సినిమాలో నానమ్మ నటన ఎక్స్ట్రాడినరీ.. డబ్బింగ్‌లో ఆవిడ సీన్స్ చూసి నా సీన్స్ మర్చిపోయా.. మా నానమ్మకు ఫిదా అయిపోయా.. అంటూ చెప్పుకొచ్చాడు. ఇది నానమ్మ – మనవడు కథ. హీరోయిన్లు పాపం.. రెండున్నర ఏళ్లు కష్టపడ్డారు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నేను సరిగ్గా మాట్లాడనని అందరూ అంటుంటారు.. ఏదో ఒక రోజు స్టేజ్ పై చేసే ఎంటర్టైన్మెంట్ కు షాక్ అయిపోతారు.. అనుకున్న బడ్జెట్ ఒకటి అయిన బడ్జెట్ ఒకటి.. అయినా మూడేళ్లు విశ్వ ప్రసాద్ గారు భయపడలేదు. ఈ సినిమాకు ఆయన రియల్ హీరో అంటూ చెప్పుకొచ్చాడు.

ఆ లెవెల్ లో ఆర్‌ఆర్ థమన్ తప్ప ఎవరూ చేయలేరని వివరించాడు. ఇక మారుతి గురించి మాట్లాడుతూ.. ఆయన కలిసినప్పుడు ఈ మధ్యన యాక్షన్ సినిమాలు ఎక్కువగా తీస్తున్నా.. ఫ్యాన్స్‌కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని అడిగా.. ఎట్టకేలకు హారర్ కామెడీ సెట్ అయింది. సినిమా వెళ్తూనే ఉంది.. మారుతి రాస్తూనే ఉన్నాడు. ఆయన రైటింగ్‌కు నేను ఫిదా అయిపోయా. ఇదొక ఊహించని కొత్త క్లైమాక్స్. హారర్ సినిమాల్లో హారర్ కాకుండా.. మరింత కొత్తగా ట్రై చేశారు మారుతి. 15 ఏళ్ల తర్వాత మారుతి మనకు మ్చి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు.. మీరే చూసుకోండి. సంక్రాంతి సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవ్వాలి.. సీనియర్స్ తర్వాతే మేము.. ముందు వాళ్లే. రేపు ట్రైలర్ వస్తుంది చూసి ఎంజాయ్ చేసేయండి అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ చేసిన ఈ కామెంట్స్ తో స్ట్రాంగ్ కామెడీ ఎంటర్టైనర్ వస్తుందని ఆడియన్స్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

