సోషల్ మీడియా లో శివాజీకి స్ట్రాంగ్ సపోర్ట్.. సెలబ్రిటీస్ వర్సెస్ నెటిజన్స్..!

తాజాగా శివాజీ దండోరా సినిమా ఈవెంట్‌లో అమ్మాయిలు మంచి బట్టలు వేసుకోండి.. ఈరోజు చక్కగా చీరలు కట్టుకొని పద్ధతిగా ఉండాలంటూ చెప్తూ.. పొరపాటున రెండు అసభ్యకరమైన పదాలను ఉపయోగించారు. దీంతో సోషల్ మీడియాలో ఇది పెద్ద దుమారంగా మారింది. కొంతమంది సెలబ్రిటీలు శివాజీ పై దుమ్మెత్తి పోస్తున్నారు. కానీ.. ఈ విషయంలో సోషల్ మీడియా, సాధారణ జనం మాత్రం శివాజీకి స్ట్రాంగ్ సపోర్ట్. హీరోయిన్స్ ఈవెంట్స్ కి బయట తమ శరీర భాగాలు కనపడేలా వేసుకోచ్చే డ్రస్సులను ఉద్దేశించి.. శివాజీ ఆ కామెంట్ చేశాడు.

Anasuya Bharadwaj : 'ఇది నా బాడీ... మీది కాదు' - 'మంగపతి' కామెంట్స్‌పై అనసూయ కౌంటర్! | anasuya bharadwaj reaction on sivaji comments about heroines dressing post gone viral

దీంతో.. శివాజీ చెప్పింది 100% కరెక్ట్ అని.. కేవలం ఒక్క ఆ 2 పదాలు తప్పు వాడడం తప్ప.. ఆయన మాటల్లో ఎలాంటి తప్పుడు భావం లేదంటూ ఇంట్లో అమ్మానాన్నలు మంచి మాటలు చెప్పరా.. అలానే ఆయన కూడా మంచికే చెప్పారా అని సోషల్ మీడియాలో సాధరణ ఆడియన్స్‌ నుంచి సపోర్ట్ కామెంట్స్ వెల్లువెతుతున్నాయి. అయితే అనసూయ, నాగబాబు, చిన్మ‌యి, ఝాన్సీ ఇంకొంతమంది స్టార్ సెలబ్రిటీస్ సైతం బహిరంగంగానే శివాజీని విమర్శిస్తూ కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే.. ఇప్పుడు శివాజీకి అపొనెంట్‌గా మాట్లాడిన వాళ్ళందరూ.. గతంలో పలు ఈవెంట్స్‌.. సినిమా షో లలో మాట్లాడిన అసభ్యకర పదాల వీడియోలను షేర్ చేస్తూ.. మరి మీరు మాట్లాడే భాష కరెక్టేనా అంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

Naga Babu: ఫ్యాషన్‌ డ్రెస్‌లు ధరించడం తప్పు కాదు: శివాజీ కామెంట్స్‌పై నాగబాబు స్పందన

అంతేకాదు.. ఇంతకన్నా నీచంగా మహిళల గురించి మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు.. వాళ్ళని ఏమీ అనరు ఈ సో కాల్ సెలబ్రిటీస్.. శివాజీ మాత్రం మాట్లాడితే తప్ప అంటూ ఫైర్ అవుతున్నారు. ఇక శివాజీ సైతం ఇప్పటికీ నా మాటలకు కట్టుబడే ఉన్నా.. నేను మంచే చెప్పా. ఆ రెండు పదాలు తప్పుగా మాట్లాడాను.. అందుకు క్షమించండి.. అవి వాడకుండా ఉండాల్సిందని అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే కొంతమంది సెలబ్రిటీలు కావాలని తమపై కుట్ర చేస్తున్నారని.. మీడియా ముందు శివాజీ వివరించాడు. అంతేకాదు నేను మాట్లాడిన ఆ పదాలకు ఎవరైనా హర్ట్ అయి ఉంటే క్షమాపణలని కూడా వివరించాడు. అయినా.. ఇంకా సెలబ్రిటీస్ దాన్ని గెలుకుతూ మరింత దుమారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ముందు ముందు ఈ వివాదం ఇంకెంత దుమారంగా మారుతుందో చూడాలి.