టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో సాలిడ్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై ఇంటర్నేషనల్ లెవెల్ హైప్ మొదలైంది. ప్రస్తుతం సుకుమార్.. రామ్‌చరణ్ తో సినిమాను ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి సుకుమార్ గురించి మాట్లాడుతూ గతంలో చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.
రాజమౌళి గతంలో ఓ ఈవెంట్లో మాట్లాడుతూ సినిమాల్లో తనకు ఫేవరెట్ మూవీ ఏదో రివీల్ చేశారు. దానికి కారణాలు కూడా షేర్ చేసుకున్నారు. రాజమౌళి మాట్లాడుతూ.. సుకుమార్ సినిమాల్లో నాకు బాగా నచ్చిన మూవీ జగడం అని.. అందులో సుకుమార్ ది బెస్ట్ ఇచ్చారంటూ చెప్పుకొచ్చాడు. ప్రతి ఫ్రేమ్ చాలా బాగుంటుందని వివరించాడు. అంతేకాదు.. నాకు స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇచ్చే డైరెక్టర్ సుకుమారే అవుతాడు అంటూ రాజమౌళి చెప్పడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పించింది.
ఇక.. ప్రస్తుతం ఆయన గతంలో చెప్పినట్లు గానే సుకుమార్ రాజమౌళికి స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తూ.. ఫుష్పాతో సాలీడ్ హిట్ కొట్టాడు. ఇక ప్రజెంట్ జక్కన.. మహేష బాబుతో వారణాసి ప్రాజెక్ట్‌ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే.. పాన్ ఇండియా లెవెల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న జక్కన్న.. ఈ సినిమాతో పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

