బాలయ్య టూ ప్రభాస్.. సినిమాల్లో గ్లామర్ క్వీన్.. 12 సంవత్సరాల తర్వాత గ్రాండ్ రీ ఎంట్రీ..!

సౌత్ సినీ ఇండ‌స్ట్రీలో ఒకప్పుడు తన గ్లామర్‌తో కుర్రకారును షేక్ చేసిన హీరోయిన్లలో నమిత ఒకరు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరమైన ఈ గ్లామర్ క్వీన్.. దాదాపు 12 ఏళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీకి సిద్ధం అయ్యింద‌ట‌. అయితే గ‌తంలోలా కాకుండా ఈసారి రూటు మార్చింద‌ని టాక్‌. గుజరాత్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మ‌డు.. తెలుగులో ఆర్యన్ రాజేశ్ సరసన ‘సొంతం’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో టాలీవుడ్‌లో వరుస అవకాశాలు దక్కించుకుంది.

namitha ‹ Namitha exclusive ‹ Spicy south indian actress namitha glamour  photos 20 — Hottest Indian Celebrities

ఆమె లైఫ్‌లో ప్రభాస్‌తో నటించిన బిల్లా గ్లామరస్ రోల్ చాలా స్పెష‌ల్‌. స్టార్ హీరోలతో జెమిని, నాయకుడు, సింహాలో న‌టించింది స్పెష‌ల్ సాంగ్స్‌తోను ఆకట్టుకుంది. 2010 నుంచి టాలీవుడ్‌కు దూరమైన ఆమె.. ఇతర భాషల్లో అడ‌పాద‌డ‌పా మూవీస్లో మెరిసింది. ఇక తాజాగా ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో పాల్గొన్న నమిత.. తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుతూ.. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయదలుచుకోలేదని చెప్పింది.

Actor Namitha gets reprieve from court

ఇప్పుడు నాకు గ్లామర్ పాత్రలు చేయాలని లేదు.. కేవలం పవర్‌ఫుల్, ఐకానిక్ పాత్రల కోసమే ఎదురుచూస్తున్నా అంటూ వివ‌రించింది. ఇకపై సినిమాల్లో కేవలం గ్లామర్ కోసం ఉండే పాత్రలను చేయ‌ను.. అలాంటి కథలు వస్తే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేస్తున్నానని చెప్పుకొచ్చింది. ప్రజెంట్ ఆమె కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి. ఈ క్ర‌మంలోనే న‌మిత‌ తన సెకండ్ ఇన్నింగ్స్‌లో ఒక్క సరైనా హిట్ కొడితే చాలు త‌న‌కు పూర్వ వైభ‌వం వ‌చ్చేస్తుందంటూ అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు.