కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. కెరీర్కీలక మలుపు తిప్పిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమా దాదాపు రూ.600 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా జైలర్ 2 రూపొందుతున్న క్రమంలో ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికంటాయి. ఈ క్రమంలోనే.. సినిమాకు సంబంధించిన ఏ చిన్న కంటెంట్ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు సినిమా నుంచి ప్రమోషనల్ కంటెంట్ కూడా రివీల్ చేయలేదు.

అయినా క్రేజ్ మాత్రం భారీగా నెలకొంది. ఇక బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ఈ రేంజ్ లో బజ్ క్రియేట్ అవ్వడం చాలా కామన్. ఇక.. ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో మీథున్ చక్రవర్తి మెరవనున్నాడు. ఆయన కూతురుగా నేషనల్ అవార్డ్ విన్నర్ విద్యాబాలన్ కనిపించనుంది. ఇక.. ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మొదట నందమూరి బాలకృష్ణని చూపించబోతున్నారని టాక్ వైరల్ గా మారింది. మేకర్స్ కూడా ఆయనను అప్రోచ్ అయ్యారట. అయితే.. ఏవో కారణాలతో బాలయ్య సినిమాను రిజెక్ట్ చేశాడు. దీంతో.. ఇప్పుడు అదే క్యారెక్టర్‌ను మరో సీనియర్ హీరో బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ చేయబోతున్నాడు.
![]()
ఇక.. మొదటి నుంచి రజనీకి షారుక్‌కు మంచి బాండ్ ఉంది. షారుక్ నటించిన చెన్నై ఎక్స్‌ప్రెస్ మూవీ లో.. లుంగీ డాన్స్ సాంగ్ హైలెట్ చేస్తూ రజనీపై ప్రశంసలు కురిపించాడు. తర్వాత షారుక్ ఖాన్ నటించిన రావణ్ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్లో మెరిసాడు. ఇక.. ప్రస్తుతం రజనీకాంత్ స్వయంగా షారుక్‌ను అప్రోచ్ అయ్యి.. తన సినిమాలో కీలక పాత్ర పోషించమని అడగడంతో.. షారుక్ వేరే ఆలోచన లేకుండా వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడట. త్వరలోనే అతని పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాదంటున్నారు. ఈ పాత్ర దాదాపు 15 నిమిషాలు నడివితో ఉంటుందని టాక్. ఇక.. ప్రస్తుతం తుది దశకు చేరుకున్న ఈ సినిమా.. వచ్చేయడాది సమ్మర్ కానుకగా ఆడియన్స్ ముందుకు రానుంది.

