‘ వారణాసి ‘ కి రాజమౌళి బిగ్ టార్గెట్.. కేవలం ఓవర్సీస్ నుంచే అన్ని కోట్లా..?

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఇప్పటివరకు తాను తెర‌కెక్కించిన ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. తెలుగు సినిమా ఖ్యాతి అంతకంత‌కు పెంచుకుంటూ పోతున్నాడు. బాహుబలి తో నేషనల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఆ తర్వాత రిలీజ్ అయిన ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ఆస్కార్ అవార్డు దక్కించుకొని ఇంటర్నేషనల్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. ఇక.. ప్రస్తుతం మహేష్ బాబుతో వారణాసి ప్రాజెక్ట్‌లో బిజీ బిజీగా గడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో.. గ్లోబల్ మార్కెట్‌ను టార్గెట్ చేసిన జక్కన్న.. ఇప్పటికే అతని విజయం ఏంటో తాజాగా రిలీజ్ చేసిన చిన్న కాన్సెప్ట్ వీడియోతో క్లారిటీ ఇచ్చేసాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ఆడియన్స్‌లో కలుగజేసాడు.

రూ.1000 కోట్ల టార్గెట్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు కొనసాగుతుంది. అయితే.. వరల్డ్ వైడ్‌గా అన్ని భాషల్లో కలిపి రూ.1000 కోట్లు కొల్లగొట్టడం జక్కన్నకు పెద్ద కష్టమేమీ కాదు. ఈ క్రమంలోనే.. ఆయన టార్గెట్ ఈసారి నెక్స్ట్ లెవెల్‌లో ఉండ‌నుంద‌ట. ఏకంగా ఓవర్సీస్ నుంచి రూ.1000 కోట్ల గ్రాస్ కొల్లగొట్టడమే వారణాసి టార్గెట్ అంటూ సమాచారం. 8 ఏళ్ల క్రితం వచ్చిన బాహుబలి 2 ఏకంగా.. 43 మిలియన్ డాలర్ల గ్రాస్ ఓవర్సీస్ నుంచి దక్కించుకుంది. ఆ రోజుల్లోనే అంతగా వసూలు వచ్చాయంటే.. అలాంటి సినిమాను మళ్ళీ చేస్తే.. ఇప్పుడు బాహుబలికి మూడింతలు ఎక్కువగా వసూళ్లో కల్లగొట్టడం ఖాయం.

అందుకే.. ఈసారి ఓవర్సీస్ కలెక్షన్స్ టార్గెట్‌ను ఏకంగా 200 మిలియన్ డాలర్లకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది. రాజమౌళి బలమైన కంటెంట్ అందిస్తే ఆ రేంజ్ గ్రాస్‌ను కొల్లగొట్టడం కూడా సులభమే. ఈ క్రమంలోనే జక్కన్నకు సాధ్యం కానిది ఏదీ లేదు అంటూ.. వారణాసితో ఖచ్చితంగా బాక్సాఫీస్ బ్లాస్ట్ చేస్తాడంటూ ఫ్యాన్స్ థీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం షూట్‌ని శ‌ర‌వేగంగా.. సీక్రెట్ గా కంటిన్యూ చేస్తున్న టీం.. 2027 సమ్మర్ బ‌రిలో గ్లోబల్ రేంజ్‌లో రిలీజ్ చేయనున్నారు. ఇక మరికొద్ది రోజుల్లో సంక్రాంతి సెలబ్రేషన్స్ మొదలైపోతాయి. ఈ క్రమంలోనే.. సంక్రాంతికి వారణాసి నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందో అనే ఆసక్తి అందరిలో మొదలైంది.