ప్రభాస్ ‘ రాజా సాబ్ ‘ట్రైలర్ రివ్యూ..

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా.. యంగ్ డైరెక్టర్ మారుతి రూపొందిస్తున్న మూవీ ది రాజాసాబ్. ప్రముఖ టాలీవుడ్ బ్యానర్ పీపుల్స్ మీడియా, ఐవివై ఎంటర్టైర్మెంట్ సంస్థలు సంయుక్త గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ మూవీకి టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల, ఈశాన్ సక్సేనా ప్రొడ్యూసర్లుగా పనిచేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో సంజయ్ దత్త్‌, బొమ్మన్ ఇరానీ, మాళవిక మోహన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ తదితరులు కీలకపాత్రలో మరువనున్నారు. జనవరి 9, 2026 సంక్రాంతి బరరిలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే ప్రమోషన్స్‌తో ఆడియన్స్‌లో భారీ హైప్‌ నెలకొంది.

అడ్వాన్స్ బుకింగ్స్‌లోను జోరు చూపిస్తుంది. ఈ క్రమంలోనే రిలీజ్ టైం దగ్గర పడుతున్న కొద్ది.. సినిమాపై క్యూరియాసిటీ మరింత‌గా పెరుగుతుంది. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారుతుంది. ఇంతకీ.. ట్రైలర్ ఎలా ఉంది.. ప్రభాస్ మొట్టమొదటి హారర్ థ్రిల్ల‌ర్‌లో ఎలా కనిపించాడో తెలుసుకుందాం. ఇది తాత – మనవడు, నాన‌మ్మ – మ‌న‌వ‌డు ఎమోషనల్ బాండింగ్ స్టోరీగా రూపొందినట్లు క్లియర్‌గా తెలుస్తుంది. ఎన్నో ఇబ్బందులు, సమస్యలతో ఉన్న రాజాసాబ్ ఫ్యామిలీకి.. మంచి రోజులు రావడానికి ముందు అసలు ఏం జరిగింది.. గంగ అవ్వను జీవితాంతం వేటాడిన.. మర్చిపోలేని సంఘటన ఏమై ఉంటుంది.. దానికోసం మ‌న‌వడు ఎలాంటి చాలెంజ్ ఎదుర్కొంటాడు.. అనేది ట్రైలర్ లో చూపించారు.

The RajaSaab Trailer 2.0 (Kannada) | Prabhas | Maruthi | Thaman S | TG Vishwa Prasad | Jan 9 2026

మ‌య‌స‌భ‌ లాంటి అతి పెద్ద పురాతన భవనంలోకి అడుగుపెట్టడం.. బయటికి వెళ్లాలంటే తాత సంతకం కావాలనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో ఈ హారర్ ఫ్యాక్టర్‌ ఎలిమెంట్స్ చూపించారు. ఈ క్రమంలోనే సినిమాను ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆశ‌క్తి నెలకొంది. కేవలం కంటెంట్ ప‌రంగానే కాదు.. టెక్నికల్‌గా సౌండ్స్, విఎఫ్‌ఎక్స్, గ్రాఫిక్స్ భారీగా ప్లాన్ చేశారు. పురాతన భవనం సెట్టింగ్ అయితే అందరిని ఆకట్టుకుంటుంది. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ రోల్‌ ఎలా ఉండబోతుంది.. తెలుసుకోవాలని ఆసక్తి ట్రైలర్ కట్ తో మరింతగా పెరిగింది. సంక్రాంతి బరిలో సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని.. ట్రైలర్‌తో ఆడియన్స్‌లో హైప్‌ క్రియేట్ చేయడంలో.. మారతి 100% సక్సెస్ అయ్యాడంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి.. మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.