ఇండస్ట్రీ ఏదైనా సినిమా సక్సెస్ అందుకోవాలంటే ఆ సినిమా ప్రమోషన్స్ సైతం కీలక పాత్ర పోషిస్తాయి. సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేయగలిగితేనే ఓపెనింగ్ నుంచి భారీ కలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సినిమా కంప్లీట్ చేయడం ఒక ఎత్తైతే.. సినిమాలు ఆడియన్స్‌లో కనెక్టయ్యేలా ప్రమోషన్స్ చేయడం మరో లెవెల్. గతంలో ఈ సినిమా ప్రమోషన్ల విషయంలో స్పెషల్ పబ్లిసిటీ డిజైనర్స్ ఉండేవాళ్ళు. కానీ.. ఇప్పుడు ఈ బాధ్యతను కూడా దర్శకులు తీసుకొని రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత అంతలా అనిల్ తన సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు.
అనౌన్స్మెంట్ నుంచి.. సినిమా రిలీజ్ ముందు వరకు ఆడియన్స్ ఎన్నో రకాలుగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ హిట్ మెషిన్ గా ట్యాగ్ సొంతం చేసుకున్నాడు. చివరిగా అనిల్ నుంచి వచ్చిన మూవీ సంక్రాంతికి వస్తున్నాం.. ఏ రేంజ్‌లో ప్రమోట్ చేశాడో.. ఎలాంటి రిజల్ట్ అందుకున్నాడో తెలిసిందే. ఇక.. ఇదే ఫార్ములాను చిరు పై ఉపయోగించి సక్సెస్ కొట్టాలని ప్రయత్నిస్తున్నాడు అనిల్. మెగాస్టార్ తో మన శంకర వరప్రసాద్ గారు సినిమా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానుంది.

ఈ క్రమంలోనే.. సంక్రాంతికి వస్తున్నాం కంటే కాస్త అడ్వాన్స్డ్‌గా చిరు మూవీ ప్రమోషన్స్ ప్రారంభించేశాడు. సినిమా అనౌన్స్‌మెంట్ నుంచి ప్రతి అప్డేట్‌తో ప్రమోషన్స్ చేస్తూ మూవీపై హైప్ క్రియేట్ చేస్తున్నాడు. అందులో భాగంగా.. సినిమాకు రెండు మేజర్ ప్రమోషన్‌లు చేయాలని ఫిక్స్ అయ్యాడట. అందులో ఒకటి ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కాగా.. మరొకటి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని.. ఓ పక్క ఆంధ్రప్రదేశ్‌లో.. మరో ప్రమోషన్ తెలంగాణలో చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో సినిమా పై భారీ క్రియేట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇక ఈసారి ప్రమోషన్స్ తో ఆడియన్స్ లో ఎలాంటి బజ్ క్రియేట్ అవుతుందో.. సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

