వారణాసి కోసం రాజమౌళి మాస్టర్ స్కెచ్.. తెలుగు హీరోలను ఒక్కటి చేయబోతున్నాడా..?

టాలీవుడ్ దర్శక ధీరుడిగా రాజమౌళి పాన్‌ ఇండియా లెవెల్లో ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాను తెర‌కెక్కించే ప్రతి సినిమాతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. రికార్డుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు సైతం ఆయనతో సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పటివరకు పాన్ ఇండియా లెవెల్‌లో సక్సెస్ అందుకున్న జక్కన్న.. ఈసారి మాత్రం పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడట. ప్రస్తుతం రాజమౌళి.. మహేష్ బాబుతో వారణాసి ప్రాజెక్ట్‌లో చేస్తున్న సంగతి తెలిసిందే.

అయితే.. ఓ పాన్ వరల్డ్ ప్రాజెక్టు మహేష్ బాబును సెలెక్ట్ చేసుకోవడం అంటే కాస్త రిస్కీ అని చెప్పాలి. కేవలం తెలుగులో తప్ప మరే భాషలోనూ ఆడియన్స్‌కు పరిచయం లేని మహేష్ బాబుతో వారణాసి సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఏదేమైనా.. ఈ సినిమా సక్సెస్ అయితే మాత్రం మహేష్ ఇమేజ్ పాన్ వరల్డ్ రేంజ్‌లో ఓ వెలుగు వెలుగుతుంది. ఈ క్రమంలోనే వారణాసి సినిమాకు ఏకంగా రూ.1300 కోట్ల భారీ బడ్జెట్లో కేటాయించారట టీం. ఇక.. ఈ సినిమా దాదాపు రూ.3000 కోట్ల భారీ టార్గెట్ తో రంగంలోకి దిగనుందట. ఈ క్రమంలోనే.. సినిమా కోసం ఇప్పటికే రాజమౌళి తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించడం డిఫరెంట్ స్ట్రాటజీలను ప్లాన్ చేస్తున్నాడని సమాచారం.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలని ఒకే స్టేజి పైకి తీసుకురాబోతున్నాడని సమాచారం. ఇదే విషయంపై రాజమౌళి గతంలో మాట్లాడుతూ ప్రమోషన్స్ కి హీరోలందరూ రావడం పక్కా అంటూ రియాక్ట్ అయ్యాడు. ఇక ఇండస్ట్రీలో ఎలాంటి విభేదాలు లేకుండా మహేష్ బాబు సైతం మంచి పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరోలు అందరూ ఆయన సినిమా ప్రమోషన్స్ కు నో చెప్పే అవకాశం లేదు. ఇక 2027 సమ్మర్ బరిలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కు సంబంధించిన పక్కా ప్లానింగ్ కూడా సిద్ధం అయిపోయిందని తెలుస్తోంది. ఇక రాజమౌళి చెప్పినట్లే అందరూ ఊహించినట్లే స్టార్ హీరోలు అంతా ఈ ప్రమోషన్స్ కి వస్తే మాత్రం పాన్ ఇండియా లెవెల్లో సినిమాకు ఆకాశానికి అంటుతుందనడంలో సందేహం లేదు.