ప్రభాస్ నటించిన లేటేస్ట్ మూవీ ది రాజాసాబ్ నుంచి నిన్న సెకెండ్ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈట్రైలర్తో.. ఫస్ట్ వచ్చిన ట్రైలర్‌తో పోలిస్తే.. మరింత స్పష్టంగా కథను రివీల్ చేశారు. విజువల్స్ సైతం ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే 2వ ట్రైలర్ తో సినిమాపై హైప్ మరింతగా పెరిగింది. ఈ ప్రభావంతోనే ప్రభాస్ ఫ్యాన్స్.. బైరెక్టర్ మారుతిని తెగ ఎత్తేస్తున్నారు. మారుతి ఇంటికి ఫ్యాన్స్ ఇప్పటికే ఓ సర్ప్రైజ్ పంపించడం.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
గత మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ‘రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ ఈవెంట్లో మారుతి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆయన సినిమాతో ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదని.. తన ఫ్యాన్స్ రెస్పాన్స్‌కు కృతజ్ఞత తెలియజేశారు. కోండాపూర్‌లోని తన ఇంటి అడ్రస్ కూడా షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే లేటెస్ట్ ట్రైలర్ చూసి తెగ సంబరపడుతున్న ప్రభాస్ ఫ్యాన్స్.. మారుతి ఇంటికి బిర్యానీ పార్సిల్స్ పంపుతు సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఈ విషయాన్ని మారుతి తన ట్విటర్ వేదికగా షేర్ చేశారు. ట్రైలర్ కేవలం ఒక్క సీన్ అయినా.. ఈ రేంజ్లో అభిమానాన్ని చూపించడంతో మూవీ విడుదల తర్వాత ఇంకెన్ని పార్సిల్స్ వస్తాయో ఊహించడానికి కష్టమవుతుందంటూ అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ‘రాజాసాబ్’ మూవీ జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ప్రీమియర్ షో జనవరి 8 రాత్రి పడిపోతుంది. హారర్-ఫాంటసీ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంగీతం తమన్ అందించారు.



