సినీ ఇండస్ట్రీలో సక్సెస్‌ఫుల్ డైరెక్టర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనిల్ రావిపూడి.. మేకింగ్ స్టైల్ లోనే కాదు.. ప్రమోషనల్ స్టైల్‌లోనూ చాలా వైవిధ్యత చూపిస్తూ ఉంటాడు. ఆయన సినిమా అఫీషియల్ ప్రకటన తర్వాత నుంచే అదిరిపోయే రేంజ్ లో సినిమాపై ప్రమోషన్స్ ను మొదలుపెట్టి.. ప్రాజెక్ట్ పై ప్రేక్షకుల్లో హైప్ పెంచేస్తాడు. ఈ క్రమంలోనే ఆయన కూడా నటినటులతో ప్రమోషన్స్ లో పాల్గొని సందడి చేస్తాడు. నవ్వులు పంచుతూ.. ఆడియన్స్‌లో మ్యాజిక్ ను క్రియేట్ చేస్తాడు. అలానే.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మారుమూల ప్రాంతం వారికి కూడా కనెక్ట్ అయ్యేలా చేసి బ్లాక్ బస్టర్ రికార్డ్ ను క్రియేట్ చేశాడు. తాజాగా ఆయన మెగాస్టార్ చిరంజీవితో మెగా 157 మూవీ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ మూవీ ప్రమోషన్స్ విషయంలో అనిల్ దూకుడు మరింతగా పెంచేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరు.. అనిల్ స్పీడ్‌కు బ్రేకులు వేస్తున్నట్లు తెలుస్తోంది. కావాలంటే కొంత గ్యాప్ ఇచ్చి.. మళ్లీ ప్రమోషన్స్ మొదలు పెడదామని చిరు.. అనిల్‌కు వివరించాడట. ఇంతకి అనిల్ స్పీడుకు చిరు బ్రేకులు వేయడానికి అసలు కారణమేంటో.. అసలు ఏం జరిగిందో.. ఒకసారి తెలుసుకుందాం. చిరు కొత్త మూవీ విశ్వంభర త్వరలోనే రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ పట్ల మొదట్లో భారీ అంచనాలే ఉన్నా.. ఇప్పుడు మాత్రం చిరు అభిమానుల్లో కూడా ఈ సినిమాపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఇలాంటి క్రమంలో అనిల్ రావిపూడి తన సినిమా కోసం చేస్తున్న ప్రమోషన్స్‌తో విశ్వంభరపై ప్రభావం మారింతగా పడుతుంది.
అందరూ మెగా 157 ప్రాజెక్ట్ కోసం ఆరాటపడుతున్నారు. నయనతారతో ప్రమోషన్స్, ఆపై సినిమా షూటింగ్ ప్రారంభ టైంలో చిరు కళ్ళపై క్లాప్ కొట్టి.. దాన్ని క్లిప్ రూపంలో రిలీజ్ చేయడం.. ఇలా ఇప్పటివరకు ప్రాజెక్ట్ నుంచి వచ్చిన ఏ చిన్న ప్రమోషన్ అయినా ఆడియన్స్‌లో జోష్‌ను మరింతగా పెంచేస్తోంది. కానీ.. విశ్వంభరపై అలాంటి హైప్ కనిపించడమే లేదు. ఈ క్రమంలోనే అనిల్ స్పీడ్‌కు చిరు బ్రేకులు వేయాలని సూచించాడట. విశ్వంభర సినిమా విషయంలో ఈ రేంజ్ పబ్లిసిటీ ఎప్పుడు జరగలేదు. మేకర్స్ అసలు అలాంటి ప్రయత్నం చేయలేదు. అయితే.. ఈ సినిమా దర్శకుడు వశిష్ట కచ్చితంగా సక్సెస్ ఇస్తాడని మాత్రం అభిమానులు నమ్ముతున్నారు.
అయితే.. సాధారణ ఆడియన్స్‌లో కూడా ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేయాలంటే.. ప్రమోషన్స్ విషయంలో వశిష్ట స్పీడ్ పెంచాల్సిందే. అప్పుడే విశ్వంభరకు మార్కెట్ పెరిగే అవకాశం ఉంటుంది. రీసెంట్‌గా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో నిర్మాత విక్రం రెడ్డి.. ఒక బుక్ లాంచ్ చేసి.. ఫోటోలు రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. కానీ.. అందులో ఉన్న సారాంశం ఏంటి.. దాన్ని స్పెషాలిటీ ఏంటి అనేది మాత్రం ఆయన రివిల్ చేయలేదు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ ఇలా చెప్పగా ఉంటే కష్టమేనని.. కచ్చితంగా వైవిద్యంగా ప్రమోషన్స్ చేస్తూ ఆడియన్స్‌లో హైప్ పెంచాలంటూ అభిమానులు రిక్వెస్ట్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ టైంకి అయినా.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో అలాంటి బజ్ క్రియేట్ అవుతుందా.. లేదా సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుంది.. వేచి చూడాలి. కాగా.. ఈ ఏడాది జులైలో సినిమా రిలీజ్ కావచ్చు అని సమాచారం.