” గేమ్ ఛేంజర్ ” హైలెట్స్ ఇవే.. ఈ రెండు సీన్ల‌కు గూస్‌బంప్స్ మోతే..!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో రూపొందిన తాజా మూవీ గేమ్ ఛేంజర్ సంక్రాంతి బరిలో జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెర‌కెక్కించనున్నారు. ఈ సినిమా ఎలాగైనా బ్లాక్ బ‌స్టర్ అవుతుందంటూ.. తిరిగి మళ్ళీ ఫామ్ లోకి రావచ్చు అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమాలో కీయారా అద్వానీ హీరోయిన్గా నటిస్తుండగా.. అంజలి మరొక పాత్రలో కనిపించనుంది. ఎస్. జె. సూర్య విలన్‌గా పవర్ ఫుల్ పాత్రతో మేరవనన్నాడు. ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో తాజాగా మేకర్స్ ట్రైలర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. మెగా ఫాన్స్‌తో పాటు సాధారణ ఆడియన్స్‌ను సినిమాపై అంచనాలను నెలకొల్పింది.

కచ్చితంగా చరణ్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటారు అంటూ మెగా ఫ్యాన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాలో రెండు అదిరిపోయే ట్విస్ట్‌లు ఉంటాయని.. ఈ రెండు ట్విస్ట్‌లు సినిమాకు హైలెట్ కానున్నాయని సమాచారం. అందులో ఒకటి ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ బ్లాక్ సీన్.. ఈ సీన్‌లో రివిల్ చేసే ట్విస్ట్ ఆడియ‌న్స్‌లో ఆశ‌క్తి పెంచేస్తుంద‌ట‌. అంతేకాదు ఇంటర్వెల్‌బ్యాక్ ముందు వచ్చే యాక్షన్ సీన్స్ కూడా ప్రేక్షకులు విపరీతంగా ఆట్టుకుంటాయని.. ఆడియోస్ లో గూస్ బంప్ తెప్పిస్తాయని సమాచారం. అలాగే సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్ లో అప్పన్న క్యారెక్టర్ పొలిటికల్ ట్విస్ట్ కూడా ఎలివేషన్స్ తో ఆడియన్స్ అసలు ఎక్స్పెక్ట్ చేయని రేంజ్ లో ఉంటుందట‌.

ఈ రెండు సీన్స్ సినిమాకు సూపర్ ట్విస్ట్‌లు అంటూ.. ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన జరగండి జరగండి సాంగ్ గురించి ఇంట్రెస్టింగ్ చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది. అంతేకాదు.. కేవలం ఈ సినిమాలో సాంగ్స్ కోసమే రూ.75 కోట్ల వరకు ఖర్చు చేశాడట శంకర్. ఇక సినిమాలోని ప్రతి సాంగ్‌కు ఓ స్పెషాలిటీ ఉందని.. సాంగ్స్ చూసేంతసేపు ఆడియన్స్ కచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ తెలుస్తుంది. ఇక చరణ్, అంజలి కాంబినేషన్ సీన్స్‌లో ఇద్దరి పర్ఫామెన్స్ అవార్ట్ విన్నింగ్ రేంజ్‌లో ఉంటుందట‌. ఇక అంజలి పాత్రకి అదిరిపోయే ట్విస్ట్ ఉంటుందని ఇప్పటికే శంకర్ వెల్లడించాడు. ఇక చరణ్, సూర్య మధ్యన వచ్చే ఫైట్ సీక్వెన్స్ ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడట శంకర్. ఇలా చరణ్ కెరీర్‌లోనే గేమ్ ఛేంజర్ చాలా స్పెషల్ మూవీ గా నిలవ‌నుందని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు. ఫైనల్ అవుట్ ఫుట్ ఎలా ఉంటుందో తెలియాలంటే జనవరి 10 సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.