గేమ్ ఛేంజర్ … ఆ లక్కీ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్న చెర్రీ.. వర్కౌట్ అయితే ఇండ‌స్ట్రీ హిట్టే..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ డైరెక్షన్‌లో తెర‌కెక్క‌నున్న గేమ్ చేంజర్‌ సినిమా.. జనవరి 10 అంటే మరికొద్ది గంటలో ఆడియన్స్‌ను పలకరించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంట్రెస్టింగ్ న్యూస్ సినీ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. చరణ్ బ్లాక్ బస్టర్ మూవీ రంగస్థలం విషయంలో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో తెలిసిందే. ఈ నేప‌ధ్యంలో ఆ సినిమాలోని సక్సెస్ ఫార్ములాను.. గేమ్ ఛేంజర్‌లో కూడా రిపీట్ చేయబోతున్నాడు అంటూ టాక్ నడుస్తుంది. చరణ్ కెరీర్‌లోనే మయిల్డ్‌ స్టోన్ లాంటి మూవీగా రంగస్థలం ఎప్పటికీ నిలిచిపోతుంది.

సుకుమార్ డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో చరణ్.. చిట్టిబాబు పాత్రలో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకున్నాడు. ఈ సినిమాతోనే చరణ్ లోని అసలైన నటుడు రెడీ అయ్యాడు. ముఖ్యంగా చెవుడుతో ఇబ్బంది పడే వ్యక్తిగా చరణ్ జీవించేసాడు. ఈ క్రమంలోనే ఆడియన్స్‌ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్గా నిలబెట్టారు. నాన్ బాహుబలి థియేట్రిక‌ల్ రికార్డ్‌ల‌ను రంగస్థలం బ్రేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో క్యారెక్టర్‌ను డిఫరెంట్ గా చూపించాలన్నట్టు కాదు.. చిట్టిబాబు చెవుడు కారణంగా ఆయన ఎదుర్కొన్న సమస్యలు.. కథను మలుపు తిప్పిన విధానం సినిమాకు మరింత ప్లస్ అయింది అనడంలో అతిశయోక్తి లేదు.

Game Changer: Ram Charan to recreate Rangasthalam formula in Shankar's film?  Here's the scoop | Telugu News - News9live

ఈ క్రమంలోనే ఇప్పుడు గేమ్ ఛేంజర్ విషయంలోనూ మరోసారి అదే ఫార్ములా ను రిపీట్ చేయనున్నాడట శంకర్. గేమ్ ఛేంజర్‌లో చరణ్ డ్యూయల్ రోల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. అందులో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో వచ్చే అప్పన్న రోల్ నత్తితో ఇబ్బంది పడే పాత్రల చూపించనున్నట్లు సమాచారం. కేవలం క్యారెక్టర్‌ని కొత్తగా చూపించడమే కాదు.. ఈ క్యారెక్టర్‌కు ఉన్న నత్తి కారణంగా కూడా.. కథ మలుపు తిరిగేలా స్టోరీని డిజైన్ చేశాడట శంకర్. ఇక రంగస్థలం సినిమాలో ఫార్ములా ఈ మూవీలో వ‌ర్కౌట్ అయ్యేనా. ఈ బ్లాక్ బస్టర్ ఫార్ములా గేమ్ ఛేంజర్‌కు ఎంతవరకు హెల్ప్ అవుతుందో.. ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో.. వేచి చూడాలి.