సినీ ఇండస్ట్రీలో ప్రతి ఏడాది ఎంతోమంది హీరోయిన్ సక్సెస్ అందుకోవాలని ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నారు. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వారిలో.. మీనాక్షి చౌదరి కూడా ఒకటి. మొదట్లో చిన్నచిన్న సినిమాల్లో హీరోయిన్గా నటించి ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది. పెద్ద హీరోలు, అలాగే చిన్న హీరోలు అని తేడా లేకుండా.. దాదాపు అందరితో సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్న మీనాక్షి.. ఈ క్రమంలోనే తాజాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనుంది.
ఇటీవల లక్కీ భాస్కర్‌తో బంపర్ హిట్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ.. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో తెరకెక్కనున సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో వెంకీ మామ ప్రియురాలిగా కనిపించనుంది. అంతే కాదు.. స్పెషల్ పోలీస్ రోల్ లోను అమ్మడు మెప్పించనుంది. ఇలాంటి క్రమంలో తాజాగా సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొని సందడి చేస్తున్న మీనాక్షి.. కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంది. గోట్ సినిమా కారణంగా తాను ట్రోలింపు గురయ్యానని.. ఆ సమయంలో ఎంతో ఆవేదన చెందానని వెల్లడించింది.
ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన మీనాక్షి.. విజయ సరసన చిందేసింది. సినిమాలో కుమారుడి రోల్‌కు హీరోయిన్‌గా నటించినందుకు ఆమె ఎంతగానో డిప్రెషన్కు వెళ్ళిపోయిందట. తనపై వచ్చిన దారుణమైన ట్రోలింగ్స్ ఆమెను ఎంతగానో ఇబ్బంది పెట్టాయాని.. అలాంటి టైంలో లక్కీ భాస్కర్ సినిమా అవకాసం వచ్చింది. ఈ సినిమాలో నటనకు ప్రశంసలు రావడమే కాదు.. మంచి సక్సెస్ అందుకున్న అంటూ వెల్లడించింది. దీంతో ఆ డిప్రెషన్ లో నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చింది మీనాక్షి చౌదరి. ప్రస్తుతం సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సందడి చేయబోతున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ఆడియోస్‌కు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇవనుందట. ఈ సినిమా ఖచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని.. సంక్రాంతి బరిలో సైలెంట్‌గా ఈ సినిమా కింగ్‌గా నిలిచిన ఆశ్చర్యపోనవసరం లేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.