డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ ఇచ్చిన స్టార్ క్రిటిక్.. ఫ్యాన్స్‌కు పండగే..!

నందమూరి నట‌సింహం.. గాడ్ ఆఫ్ మాసస్ బాలకృష్ణ హీరోగా నటించిన డాకు మహారాజ్ జనవరి 12న‌ సంక్రాంతి బ‌రిలో గ్రాండ్‌గా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. హిట్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థ‌మన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా వ్యవహరించిన ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా కనిపించగా.. ఊర్వశీర్వతుల స్పెషల్ సాంగ్లో మెప్పించనుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి తాజాగా సెన్సార్ సభ్యుడు, క్రిటిక్ ఉమైర్ సంధు రివ్యూ ఇచ్చాడు. ఇక సినిమా డిమాండ్ ప్రకారం ఎక్కడ లోటు చేయకుండా రూ.150 కోట్ల వరకు బడ్జెట్ పెట్టి మరి సినిమాను తెర‌కెక్కించారు.

ఈ సినిమా వరల్డ్ వైడ్ హక్కులు రూ.83 కోట్ల వరకు అమ్ముడుపోయాయి. ఈ క్రమంలోనే సినిమా లాభాలు రావాలంటే రూ.84 కోట్ల షేర్ రూ.168 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టాల్సి ఉంది. సినిమా బ్లాక్ బస్టర్ కావాలంటే దాదాపు రూ.100 కోట్ల షేర్.. రూ.200 కోట్ల గ్రాస్ వసూలు కొల్లగొట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇలా భారీ అంచనాలు నడుమ గ్రాండ్ గా రిలీజ్ కానున్న డాకు మహారాజ్‌కు దుబాయ్ సెన్సార్ సభ్యుడు ఉమైర్ సంధు తనదైన స్టైల్ లో రివ్యూ అందించాడు. సోషల్ మీడియా అకౌంట్లో ఆయన పోస్ట్ ను షేర్ చేస్తూ.. బాలయ్య పర్ఫామెన్స్ ను ఆకాశానికి ఎత్తేసాడు. సినిమా గ్యారంటీగా బ్లాక్ బ‌స్టర్ అంటూ.. తన ట్విటర్ వేదికగా వివరించాడు. సెన్సార్ బోర్డు నుంచి డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ అంటూ రాసుకొచ్చిన ఉమైర్.. మాస్ ప్రేక్షకుల కోసం డిజైన్ చేశారు.

యాక్షన్, ఎమోషన్స్, డ్రామా, హ్యూమర్ లాంటి అంశాలను దట్టించి సినిమాను రూపొందించారు అంటూ వెల్లడించడు. నందమూరి బాలయ్య బాబు డ్యూయల్ పెర్ఫార్మెన్స్ చూపించిన తీరు ప్రేక్షకుడికి పైసా వసూల్ గా అనిపిస్తుందని.. ఈ అంశాలే థియేటర్ కు ఆడియన్స్‌ను రప్పిస్తాయని తన రివ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉమైర్ రివ్యూ బాలయ్య ఫ్యాన్స్ ఆనందాన్ని క‌ల్పిస్తుంది. సినిమాపై మరింత ఆసక్తి పెంచుతుంది. సినిమా ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అంటూ.. బాలయ్య మరోసారి హ్యాట్రిక్ నాంది పలకడం ఖాయం అంటూ.. రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉమూర్ త‌న రివ్యూలో మూవీ ధియేట‌ర్స్‌లో చూడండి.. మస్తు మజా వస్తుందని వెల్లడించాడు. ఇక సినిమా అవుట్ ఫుట్ ఎలా వచ్చిందో తెలియాలంటే మాత్రం మూవీ రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే.