నందమూరి నటసింహం బాలకృష్ణ ముక్కుసూటి మనిషి అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఆయన సన్నిహితులు, ఆయనతో పనిచేసిన ఎంతోమంది కోస్టార్స్ కూడా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక బాలయ్యకు కోపం వచ్చి అభిమానులపై ఓపెన్ గానే చేయి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనకు కోపం ఎక్కువని అంతా భావిస్తారు. అయినా.. బాలయ్యను మాత్రం ఇప్పటికి ఇష్టపడుతూనే ఉంటారు. ఆయనపై అభిమానాన్ని కురిపిస్తూనే ఉంటారు. ఆయనది ఎంత గొప్ప మనసో ఇప్పటికే బయట ప్రపంచానికి తెలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్ యాంకర్ గా వెలుగు వెలిగిన ఉదయభానుకు తెలుగు ప్రేక్షకుల ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం ఆమె ఫామ్‌లో లేకున్నా.. బాలకృష్ణ అంటే ఆమెకు ఉన్న అమితాభిమానం స్టేజ్ పైకి వెళ్లి మైక్ పట్టుకుంటే చాలు తన్నుకొస్తుంది.
బాలయ్య గురించి ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తుంది. ఈ క్రమంలోనే రేణు దేశాయ్ జడ్జ్‌గా వ్యవహరించిన నీతోనే డ్యాన్స్ షోలోను ఉదయభాను బాలయ్య గొప్ప మనసు గురించి ఒక సంఘటనను వెల్లడించింది. ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయింది. అది చూసిన రేణు దేశాయ్ ఆశ్చర్యపోయారు. ఉదయభాను మాట్లాడుతూ.. నా పిల్లల పుట్టిన రోజు తప్పకుండా మీరు రావాలని బాలయ్య కు మెసేజ్ చేశాను.. అయినా మెసేజ్ సెండ్ చేసిన అరగంటకు కాల్ చేసి ఉదయభాను ఇన్వైట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది.. నేను తప్పకుండా వస్తాను అంటూ చెప్పారని.. చెప్పిన టయానికి ఆయన బర్త్డే ఫంక్షన్‌కు హాజరయ్యారు అంటూ వివరించింది.
ఆయన వస్తుంటే సింహం వచ్చినట్లు ఉంది. కానీ.. నాకు మాత్రం దేవుడు వస్తున్నట్లు అనిపిస్తుంది అంటూ ఉదయభాను ఎమోషనల్ అయ్యారు. అది చూసి రేణు దేశాయ్ చప్పట్లు కొట్టారు. అందరి హీరోలలా బాలయ్య 5 నిమిషాలు ఫార్మల్ గా ఉండి వెళ్ళిపోలేదని.. బర్త్డే ఫంక్షన్ లో 45 నిమిషాలు ఉన్నారని ప్రతి ఒక్కరికి ఫోటో ఇచ్చారు.. బాలయ్య లాంటి వ్యక్తి ఇండస్ట్రీలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు అంటూ ఉదయభాను ప్రశంసల వర్షం కురిపించింది. మరో మూడు రోజుల్లో బాలయ్య నటించిన డాకుమహరాజ్ సినిమా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి తన మాస్ యాక్షన్ తో అలరించడానికి బాలయ్య రంగంలోకి దిగుతున్నారు. యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో శ్రద్ధ శ్రీనాధ్, ప్రగ్యా జైశ్వాల్, ఊర్వసీ రౌతెలా నటించారు. ఇక సినిమా అవుట్‌పుట్ ఎలా ఉందో తెలియాలంటే రిజల్ట్ వచ్చేవరకు వేచి చూడాల్సింది.