టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్‌కు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం జనసేన అధినేతగా ఏపి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ వారసుడిగా ఆఖీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా అంటూ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు సరైన క్లారిటీనే లేదు. ఎవరు దీనిపై రియాక్ట్ అయింది కూడా లేదు. కాగా.. తాజాగా గ్లోబల్ సార్ రామ్ చరణ్.. ఆకీర సినిమా ఎంట్రీ గురించి ముచ్చటించారు.
అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బికే షోలో పాల్గొన్న ఆయన.. ఆకిర నందన్ సినీ ఎంట్రీపై రియాక్ట్ అయ్యాడు. సినిమాలో ఆకిరా కనిపిస్తాడట అని బాలయ్య అడిగిన ప్రశ్నకు.. వైవిధ్యమైన రీతిలో స్పందించాడు. ఏమో ఓజీలో కనిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు అంటూ చరణ్ హింట్ ఇచ్చాడు. ఓజితో ఆఖీరా ఎంట్రీ ఉండబోతుందనే విషయాన్ని చరణ్ చెప్పకనే చెప్పేశాడంటూ. అకీరా ఎంట్రీ ఓజీతో కన్ఫామ్ అంటూ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు ఈ విషయం తెగ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ అయింది. ఇందులో బాబాయ్ పవన్ కళ్యాణ్ గురించి.. తమ్ముడు ఆఖీరా నందన్ గురించి.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు చరణ్.
ఇక చరణ్‌తో పాటు.. క్లోజ్ ఫ్రెండ్స్ శర్వానంద్, వికాస్ అలాగే ప్రొడ్యూసర్ దిల్ రాజు కూడా ఈ షోలో సందడి చేశారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ సినిమా ఆడియన్స్‌లో ఆసక్తి నెలకొల్పింది. మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో శంకర్ డైరెక్షన్ వహించిన ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఇక తాజాగా సినిమా నుంచి రిలీజ్ అయ్యిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్ తెచ్చిపెట్టింది. ఇక రిజల్ట్ ఎలా ఉండనుందో తెలియాలంటే.. మూవీ ప్రీమియర్ షో టాక్ వచ్చేవరకు వేచి చూడాల్సిందే.