సంక్రాంతి బరిలో టాలీవుడ్ స్టార్ హీరోస్ రామ్ చరణ్, బాలయ్య నుంచి గేమ్ ఛేంజర్, డాకు మహరాజ్ సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చేసింది. 14 రోజులపాటు టికెట్ రేట్లను పెంచుకునేలా జీవో పాస్ చేసింది. ప్రీమియర్ షో లతో పాటు సినిమాలకు 14 రోజులపాటు టికెట్ రేట్లు పెంచుకునే అవకాశాన్ని ఇచ్చింది. అయితే ఈ నిర్ణయాని అంగీకరించని హైకోర్టు.. సినిమాకు పది రోజులు మాత్రమే అధిక ధరలు పెంచుకోవచ్చని వెల్లడించింది.
ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా పరిశ్రమకు మద్దతు నిలవాలని ఉద్దేశంతో పెద్ద సినిమాలు టికెట్ ధరలు పెంచేకొనే అవకాశాన్ని అందిస్తుంది అంటూ ఇటీవల గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం జీఎస్టీ రూపంలో 18 శాతం అదనంగా వస్తుందని వివరించిన ఆయన.. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో సినిమాలు తీసేందుకు పెట్టుబడి తిరిగి రావాలని పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. రిలీజ్ ఈవెంట్ కూడా అనంతపురంలో నిర్వహించేందుకు ఏర్పాటులు జరుగుతున్న సంగతి తెలిసిందే.
కాగా తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సినిమా టికెట్ల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే సందేహం నిన్న మొన్నటి వరకు ఆడియన్స్ అందరిలోనూ ఉంది. అయితే.. తాజాగా రేవంత్ రెడ్డిని కలిసిన దిల్ రాజు గేమ్ ఛేంజర్‌కు స్పెషల్ పర్మిషన్స్ తెచ్చుకున్నారు. ఇక రేవంత్ రెడ్డి బెన్ఫిట్ షోలకు అనుమతి ఇవ్వకుండా.. పది రోజులు గేమ్ ఛేంజర్ సినిమా టికెట్ రేట్ల పెంపుకు అనుమతినిచ్చినట్లు సమాచారం. నేడు దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. ఈ క్రమంలోనే తెలంగాణలో డాకు మహారాజ్ సినిమా టికెట్ రేట్ల పెంపు విషయంలో అన్యాయం జరుగుతుందంటూ బాలయ్య సినిమాకు కూడా టికెట్ రేట్లు పెంచాలంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.