టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గ్లోబల్ స్టార్ గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే శంకర్ దర్శకత్వంలో చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా.. పాన్ ఇండియా లెవెల్‌లో జనవరి 10, 2025న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. అయితే కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, ఎస్ జె సూర్య, సముద్రఖని, నవీన్ చంద్ర, శ్రీకాంత్ కీలకపాత్రలో నటించిన ఈ సినిమాలో ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే ఆడియన్స్ లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.
అయితే తాజాగా దీనిపై మరింత ఆసక్తిని పెంచేలా ఓ సర్‌ప్రైజింగ్ న్యూస్ వైరల్ గా మారుతుంది. ఇటీవల గేమ్ ఛేంజెర్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈవెంట్లో పాల్గొని సందడి చేసిన ఎస్.జే.సూర్య మాట్లాడుతూ.. సినిమాలో తనకు నాలుగు విలక్షణమైన లుక్స్ ఉంటాయంటూ చెప్పుకొచ్చాడు. సూర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాంటి పాత్రలోనైనా తన నటనతో మెప్పించే ఈయన.. ఈ సినిమాలో ఏకంగా నాలుగు డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించనున్నాడంటూ తెలియడంతో ఆడియన్స్ లో మరింత ఆసక్తి నెలకొంది.
వీటిలో రెండు షేడ్స్ ఇప్పటికే ట్రైలర్‌లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రెండిటిని మేకర్స్ హైడ్ చేశారు. సినిమా రిలీజ్ అయ్యేంతవరకు ఆ రెండు రోల్స్ ని సర్ప్రైసింగ్ గా ఉంచాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాదు ఇప్పటికే సినిమాలో సూర్య నటన ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుందని.. ఎప్పటికీ సూర్య పాత్ర ఆడియన్స్‌లో గుర్తుండిపోతుందంటూ మూవీ టీం వెల్లడించారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక మరికొద్ది గంటలో రిలీజ్ కానున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.