టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటకు టాలీవుడ్‌లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎట్టకేలకు వీరికి సంబంధించిన న్యూస్.. టాలీవుడ్ సర్కిల్స్ లో వైరల్ గా మారింది. ఫైనల్గా ప్రభాస్, అనుష్క ఒకటి కానున్నారని.. దానికి ముహూర్తం కూడా ఫిక్స్ అయింది అంటూ సమాచారం. అయితే ఇది ప్రభాస్, అనుష్కల పెళ్లికి సంబంధించిన న్యూస్ అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న న్యూస్ వీళ్ళ పెళ్లి గురించి కాదు.. త్వరలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ బడా పాన్ ఇండియన్ సినిమా రానుందట.
ఆ సినిమా మరేదో కాదు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ స్పిరిట్ అని తెలుస్తుంది. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు దగ్గర పడ్డాయని.. ఈ ఏడాది సినిమాకు సంబంధించిన షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల నుంచి ప్రభాస్‌కు హీరోయిన్ ని వెతికే పనిలో బిజీగా ఉన్నా సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌కు అనుష్క అయితే పూర్తిగా సెట్ అవుతుందని ఆమెను ఫిక్స్ చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక స్పిరిట్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న సంగతి తెలిసిందే.
ఈయనకి జోడిగా అనుష్క కనిపించబోతుందట. ఇక త్వరలోనే సినిమాకు మంచి ముహూర్తం చూసి పూజా కార్యక్రమాలను స్టార్ట్ చేయాలని టీం భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది సినిమా పట్టాలెక్కనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ప్రభాస్, అనుష్క నిజంగా మళ్ళి కలిసి నటిస్తే మాత్రం ఇది ఫ్యాన్స్‌కు శుభవార్త అనడంలో సందేహం లేదు.