సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్, టికెట్ హైక్ కు పర్మిషన్లు ఉండవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరాకండిగా చెప్పేసిన సంగతి తెలిసిందే. దీంతో టాలీవుడ్ ఒకసారిగా ఉలిక్కిపడింది. ఈ ఏడాది మొత్తం పాన్ ఇండియా సినిమాలో రిలీజ్ అవ్వనున్న క్రమంలో.. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇలాంటి కండిషన్స్ పెట్టడం అందరికీ షాక్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి నిర్ణయం థియేట్రికల్ రెవెన్యూ పై ఘోరమైన ప్రభావం చూపిస్తుందని అందరూ ఆందోళన పడ్డారు. ఈ క్రమంలోనే సినీ ప్రముఖులంతా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయితే ఆ ప్రయత్నం ఫలించలేదు. గేమ్ ఛేంజర్‌కు స్పెషల్ పర్మిషన్స్ ఇప్పుడైనా రేవంత్ రెడ్డి ఇస్తే బాగుండని అంత ఆశాపడ్డారు. దిల్ రాజు కూడా మొన్నటి ప్రెస్‌మీట్లో ఇదే విషయాన్ని చెప్పుకొచ్చాడు.
రేవంత్ రెడ్డి సార్ ని కలవబోతున్నానని వివరించాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి టికెట్ హైక్, బెనిఫిట్ షోస్ కి రేవంత్ పర్మిషన్లు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోను అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడానికి వీలులేదని.. పోలీసులు అందించిన సూచనలు తూచా తప్పకుండా పాటించాలని సీఎం రేవంత్ రెడ్డి రూల్స్ పెట్టాడట. ఏదైనా జరగరానిది జరిగితే ఆ థియేటర్ లైసెన్స్ పూర్తిగా బ్యాన్ చేసేస్తామని ఆయన వివరించినట్లు సమాచారం. దిల్ రాజు కూడా ఈ అంశాన్ని ప్రతిష్టాత్మకంగా బాధ్యతాయుతంగా తీసుకొని జాగ్రత్తగా ఉంటారని వెల్లడించినట్లు.. అడ్వాన్స్ బుకింగ్ కొద్దిసేపట్లో మొదలుకానున్నాయని సమాచారం.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రల అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రస్తుతం ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే కర్ణాటక అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమై కేవలం బెంగళూరు సిటీలోనే కోటి రూపాయల వరకు గ్రాస్ వసూళ్ళు సంపాదించారు. బెనిఫిట్ షో కి రూ.600 అయినా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. సింగల్ స్క్రీన్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. కానీ.. మల్టీప్లెక్స్ కి సంబంధించిన బుకింగ్ ఇంకా ఓపెన్ చేయలేదు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం పూర్తిస్థాయి అడ్వాన్స్ బుకింగ్ మొదలయ్యాక ఫైనల్ రీజల్ట్ మూడు కోట్లకు పైగా ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు వివరించాయి. ఆ స్థాయిలో ఉంటే మాత్రం ఫస్ట్‌డే సినిమాకి ఖచ్చితంగా ఏడు కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రావడం ఖాయం. ఇక ముందు ముందు ఏం జరగనుందో సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.