సంక్రాంతి పండుగ అంటేనే టాలీవుడ్‌కు సెద్ద పండుగ సీజన్. ఇలాంటి క్రమంలోనే తమ సినిమాలను రిలీజ్ చేయాలని చిన్న హీరోల నుంచి స్టార్ హీరోల వరకు దర్శక, నిర్మాతలు కూడా ఎంతో ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడది కూడా సంక్రాంతి బరిలో ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి నటసింహం బాలకృష్ణ, సీనియర్ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ నటించిన మూడు సినిమాలు వరుసగా ఆడియన్స్ ముందుకు రానున్నాయి. మొదట ఈ సంక్రాంతి బరిలో జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ అవుతుండగా.. జనవరి 12న డాకు మహరాజ్, జనవరి 14న సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు రిలీజ్ కానున్నాయి.
అయితే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం డాకు మహారాజ్, గేమ్ ఛేంజర్ రెండు సినిమాల టికెట్ ధరల పెంపుకు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ రిలీజ్ రోజు 1గంట బెనిఫిట్‌షోలకు పర్మిషన్ ఇవ్వడంతో పాటు.. టికెట్ రేట్లు రూ.600గా నిర్ణయించింది. డాకు మహారాజ్ బెనిఫిట్ షోకు రూ.500 పెంచుకునేలా పర్మిషన్లు ఇచ్చింది. అయితే మల్టీప్లెక్స్ లో రూ.175, సింగిల్ స్క్రీన్ లో రూ.135 వరకు టికెట్ రేట్ ను పెంచుకోవచ్చని అనుమతినిచ్చింది. జనవరి 23 వరకు ఈ టికెట్ ధరలు పెంచుకునే వీలు కల్పించింది ఏపీ ప్రభుత్వం.
అయితే ఏపీలో టికెట్ రేట్స్ పెంచడంపై సవాలు విసరుతో హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇక 1 గంటకు బెనిఫిట్‌షో అనుమతులు ఇవ్వడం వల్ల రాష్ట్రంలో శాంతిభద్రతలకు సమస్య వాటిల్లుతుందని.. కేసుపై పిటీషనర్ ప్రస్తావించారు. అంతేకాదు నిబంధనలకు విరుద్ధంగా ఏపీలో టికెట్ ధరలు పెంచారని వెల్లడించారు. ఈ పిటేషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన కోర్ట్.. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ మేకర్స్ కు చిన్న ఝలక్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ టికెట్ రేట్స్ పెంపు పై షాకింగ్ ఆదేశాలను జారీ చేసింది. 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచుతూ ఏపీ ఇచ్చిన పర్మిషన్లను సవాల్ చేస్తూ అపీల్‌పై విచారణ జరిపిన కోర్ట్ 14 రోసుల పర్మిషన్‌ను.. పది రోజులకు పరిమితం చేసింది.