ఆ సినిమా చేసినందుకు ఇప్పటికీ బాధపడుతున్నా.. రామ్ చరణ్ షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం గ్లోబల్స్టార్ రేంజ్‌కు ఎదిగిన సంగతి తెలిసిందే. ఆర్‌ఆర్ఆర్ సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్‌ను సొంతం చేసుకున్న చరణ్.. మరికొద్ది రోజుల్లో గేమ్ ఛేంజ‌ర్‌ సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై.. దిల్ రాజు ప్రొడ్యూసర్ గా.. భారీ బడ్జెట్ సినిమాను ఎంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో ఎన్నో బ్లాక్ బ‌స్టర్లు అందించిన శంకర్.. ఈ సినిమాకు డైరెక్టర్గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. కియారా అద్వానీ హీరోయిన్గా.. అంజలి, శ్రీకాంత్, నవీన్ చంద్ర, ఎస్‌.జే. సూర్య, సముద్రఖ‌నీ కీలక పాత్రలో నటించిన ఈ సినిమాపై ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఇక సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. కాగా జనవరి 10న గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో చరణ్ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇందులో భాగంగానే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చరణ్.. ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నాడు. ఇందులో భాగంగానే ఇంటర్వ్యువర్ ప్రశ్నకు చ‌ర‌ణ్‌ రియాక్ట్ అవుతూ తన కెరీర్లో ఏ మూవీ చేసినందుకు ఇప్ప‌టికి బాధపడుతున్నాడో వెల్లడించాడు.

Toofan (2013) - IMDb

జింజేర్ సినిమాను రీమేక్ గా చేసినందుకు ఇప్పటికి బాధపడుతున్నాను అంటూ వెల్లడించడు. సినిమాను తెలుగులో తుఫాన్ పేరుతో రీమేక్ చేసి రిలీజ్ చేశారు. అయితే సినిమా ఊహించిన స‌క్స‌స్‌ అందుకోలేదు. ఈ సినిమాలో చ‌ర‌ణ్ సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించింది. టాలీవుడ్ లో ప్రియాంక చోప్రా నటించిన ఏకైక సినిమా కూడా ఇదే కావడం విశేషం. అయితే 1973లో రిలీజ్ అయిన జంజేర్‌లో అమితాబచ్చన్ హీరోగా నటించగా ఈ మూవీబ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. దాని రిమేక్ తుఫాన్ డిజాస్టర్ గా నిలిచింది. అయితే ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో ఈ రీమేక్‌ నటించినందుకు ఇప్పటికి బాధపడుతున్నాను అంటూ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.